Share News

దసరా మహోత్సవాలకు రండి.. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

ABN , Publish Date - Sep 30 , 2026 | 01:24 PM

ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వర స్వామి దసరా మహోత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు.

దసరా మహోత్సవాలకు రండి.. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
Indrakeeladri Dasara

అమరావతి, సెప్టెంబర్ 30: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వర స్వామి దసరా మహోత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు. అక్టోబర్ 11 నుంచి 20 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు(బుధవారం) క్యాంప్ కార్యాలయంలో సీఎంను దుర్గగుడి అధికారులు కలిశారు. ఈ సందర్భంగా దసరా మహోత్సవాలకు సంబంధించి ఆహ్వానపత్రికను ముఖ్యమంత్రికి అందించారు.


దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆధ్వర్యంలో సీఎంను కలిసి దసరా ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. అమ్మవారి ప్రసాదాన్ని అందజేసిన ఆలయ అర్చకులు.. చంద్రబాబుకు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఉత్సవాల ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు.. అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దుర్గగుడి చైర్మన్‌తో పాటు.. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఈఓ శీనా నాయక్, బోర్డు సభ్యులు.. సీఎంను ఆహ్వానించిన వారిలో ఉన్నారు.


ఇవి కూడా చదవండి...

వైసీపీ హయాంలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు.. విచారణకు జనసేన నేత డిమాండ్

ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల ఆర్చరీ జట్టుకు స్వర్ణం.. మంత్రి మండిపల్లి అభినందనలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 30 , 2026 | 01:32 PM