Share News

విజృంభిస్తున్న వైరల్‌ ఫీవర్‌.. వారంలో ఇద్దరి మృతి

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:52 AM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో వై రల్‌, డెంగ్యూ జ్వరాలు చాపకింద నీరులా విజృంభిస్తుండడంతో పల్లె ప్రజలు జ్వరాలతో పడకేస్తున్నారు.

విజృంభిస్తున్న వైరల్‌ ఫీవర్‌.. వారంలో ఇద్దరి మృతి
Viral Fever

  • గడిచిన వారం రోజుల్లో ఇద్దరి మృతి

  • ఆసుపత్రుల్లో పెరుగుతున్న ఓపీల సంఖ్య

  • పట్టించుకోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు

చెన్నూరు(మంచిర్యాల): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో వై రల్‌, డెంగ్యూ జ్వరాలు చాపకింద నీరులా విజృంభిస్తుండడంతో పల్లె ప్రజలు జ్వరాలతో పడకేస్తున్నారు. గడిచిన వారం రోజుల్లో డెంగ్యూ, వైరల్‌ ఫీవర్‌తో ఇద్దరు మృతిచెందినప్పటికీ సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధి కారులు పట్టించుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. సాక్షాత్తూ మంత్రి వివేక్‌వెంకటస్వామి ప్రాతి నిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి దాపురిం చింది అంటే అధికారుల తీరు ఎలా ఉందో అట్టే అర్థమవుతోంది.


ఒక వైపు వాతావరణంలో ఏర్పడుతున్న మా ర్పులు, మరో వైపు మండలంలోని పలు గ్రామాల్లో పట్ట ణంలోని పలు కాలనీల్లో పారిశుధ్యం లోపించి ఈగలు, దోమలు వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారిన పడుతు న్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇంత వరకు పట్టణంతో పాటు మండలంలోని ఏ ఒక్క గ్రామంలో కూడా అధికారులు శానిటేషన్‌ చేసిన దాఖలాలు లేవ న్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. దీనికి తోడు మంచినీటి సరఫరా అయ్యే పైపులైన్‌లలో లీకేజీలు ఏ ర్పడడం మూలంగా ఆ నీరు కలుషితమై రోగాలు ప్ర బలుతున్నాయి.


వారం రోజుల క్రితం మండలంలోని అంగ్రాజ్‌పల్లి గ్రామానికి చెందిన రత్న నిహానిరెడ్డి (6) అనే పాప వైరల్‌ జ్వరం సోకడంతో కుటుంబీకులు స్థానికంగా వైద్య చికిత్సలు అందించారు. పరిస్థితి విష మించడంతో కుటుంబీకులు ఉన్నత వైద్యం కోసం మం చిర్యాలకు తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేర కు పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్న క్రమంలో పాప డెంగ్యూ లక్షణాలతో మృతిచెందిన ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపగా కుటుంబానికి తీరని కడుపుకో తను మిగిల్చింది. మండలంలోని కత్తెరసాల గ్రామానికి చెందిన అంగ మైత్రి(21) ఐదు రోజుల క్రితం వైరల్‌ జ్వరంతో మంచం పట్టింది.


viral.jpgతల్లిదండ్రులు స్థానికంగా ఉ న్న ఆర్‌ఎంపీ దగ్గర చికిత్స చేయించారు. పరిస్థితి వి షమించడంతో మైత్రిని మంచిర్యాలకు తరలించారు. అ క్కడ పరీక్షించిన వైద్యులు ఉన్నత వైద్యం కోసం హై ద్రాబాద్‌కు తరలించారు. హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మైత్రి శనివారం రాత్రి మృతిచెందినట్లు సమీప బంధువులు పేర్కొన్నారు. మై త్రి జ్వరంతో మృతిచెందడంతో గ్రామంలో విషాధచా యలు అలుముకున్నాయి. ప్రతి గ్రామం, పట్టణంలోని ప్రతి కాలనీలో ఇంటికి ఒకరు లేదా ఇద్దరు చొప్పున జ్వర పీడితులు ఉన్నారు. అయినప్పటికీ సంబంధిత అ ధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు.


రోజుకు 300 దాటుతున్న ఓపీలు..

పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి రోజుకు 300 నుంచి 400 మంది జ్వర పీడితులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సత్యనా రాయణ పేర్కొన్నారు. గడిచిన ఐదు రోజుల వ్యవధిలో ఓపీలు ఈ విధంగా ఉన్నాయి. ఈ నెల 25న 297 మంది, 26న 345 మంది, 27న 110 మంది, 28న 359 మంది ఆసుపత్రికి తరలి రాగా మంగళవారం 260 మంది పరీక్షలు నిర్వహించుకున్నారు. ప్రభుత్వ ఆసుప త్రిలోనే పరిస్థితి ఇలా ఉంటే పట్టణంలోని ప్రైవేటు ఆ సుపత్రులతో పాటు ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యుల వద్దకు రోజుకు వందల సంఖ్యలో జ్వర పీడితులు పరీక్షలు చేయించుకుని చికిత్సలు పొందుతున్నారు. మరో వైపు మెరుగైన వైద్యం కోసం పట్టణ ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు.


మంత్రివర్యా స్పందించండి

చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి వివేక్‌ వెంకటస్వామి తక్షణమే స్పందించి జ్వర పీడితులకు వైద్య సేవలు అందించేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ఇప్పటికైనా మంత్రి పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయించి ప్రజలకు చికిత్సలతో పాటు అవగాహన క ల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి:

వీధుల్లో కుక్కలు.. ఇళ్లపై కోతులు

రైస్ మిల్లర్ల ఆటకు ఇక బ్రేక్..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 30 , 2026 | 11:52 AM