బంగారం యూటర్న్.. భారీగా పెరిగిన ధరలు
ABN , Publish Date - Sep 03 , 2026 | 10:28 AM
భారత్‌లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గత మూడు రోజులుగా వరుసగా పతనమైన ధరలు నేడు ఒక్కసారిగా రూ.3 వేల పైచిలుకు మేర పెరిగాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గత మూడు రోజులుగా వరుసగా పతనమైన ధరలు నేడు ఒక్కసారిగా రూ.3 వేల పైచిలుకు మేర పెరిగాయి. డాలర్ బలహీనపడటం, యూఎస్ బాండ్స్‌పై రాబడులు తగ్గడంతో బంగారానికి మళ్లీ డిమాండ్ పుంజుకుంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి (సెప్టెంబర్ 3) ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,350కు పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.3,333 మేర ఎగబాకింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.3,020 మేర పెరిగి రూ.1,42,400కు చేరుకుంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,16,510కు ఎగబాకింది. నగరంలో కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.5 వేల మేర పెరిగి రూ.2.5 లక్షలకు చేరుకుంది.
తెలంగాణలోని నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు ఇవీ
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
వరంగల్ | ₹1,55,350 | ₹1,42,400 | ₹1,16,510 |
నిజామాబాద్ | ₹1,55,350 | ₹1,42,400 | ₹1,16,510 |
ఖమ్మం | ₹1,55,350 | ₹1,42,400 | ₹1,16,510 |
ఏపీలోని నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు ఇవీ
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విశాఖపట్నం | ₹1,55,350 | ₹1,42,400 | ₹1,16,510 |
విజయవాడ | ₹1,55,350 | ₹1,42,400 | ₹1,16,510 |
అమరావతి | ₹1,55,350 | ₹1,42,400 | ₹1,16,510 |
కాకినాడ | ₹1,55,350 | ₹1,42,400 | ₹1,16,510 |
తిరుపతి | ₹1,55,350 | ₹1,42,400 | ₹1,16,510 |
భారత్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు ఇవీ
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,55,350 | ₹1,42,400 | ₹1,19,690 |
ముంబై | ₹1,55,350 | ₹1,42,400 | ₹1,16,510 |
ఢిల్లీ | ₹1,55,500 | ₹1,42,550 | ₹1,16,660 |
కోల్‌కతా | ₹1,55,350 | ₹1,42,400 | ₹1,16,510 |
బెంగళూరు | ₹1,55,350 | ₹1,42,400 | ₹1,16,510 |
కేరళ | ₹1,55,350 | ₹1,42,400 | ₹1,16,510 |
పుణె | ₹1,55,350 | ₹1,42,400 | ₹1,16,510 |
వడోదరా | ₹1,55,400 | ₹1,42,450 | ₹1,16,560 |
గమనిక: పైన పేర్కొన్న ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి నగలు కొనుగోలు చేసే సమయంలో ధరలను మరోసారి చెక్ చేసుకోవాలని సూచన.
ఈ వార్తలనూ చదవండి:
ప్రవాసుల నిధుల వెల్లువ.. ఫలితాన్నిచ్చిన ఆర్‌బీఐ చర్యలు