Share News

వీధుల్లో కుక్కలు.. ఇళ్లపై కోతులు

ABN , Publish Date - Sep 30 , 2026 | 10:56 AM

కరీంనగర్ జిల్లా సైదాపూర్‌ మండలంలోని పలు గ్రామాల ప్రజలు కుక్కలు, కోతుల బెడదతో సతమతమవుతున్నారు.

వీధుల్లో కుక్కలు.. ఇళ్లపై కోతులు

  • సైదాపూర్‌ మండల ప్రజల తిప్పలు

  • నియంత్రించాలని విజ్ఞప్తి

సైదాపూర్‌(కరీంనగర్): కరీంనగర్ జిల్లా సైదాపూర్‌ మండలంలోని పలు గ్రామాల ప్రజలు కుక్కలు, కోతుల బెడదతో సతమతమవుతున్నారు. వీధుల్లోకి వెళ్తే కుక్కలు, ఇళ్లపై కోతులతో బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా కుక్కలు రాత్రి వేళ బైకులు, కార్లను వెంబడిస్తున్నాయి. పలువురు ద్విచక్రవాహనదారులు ప్రమాదాల బారిన పడి గాయపడిన సంఘటనలు ఉన్నాయి. మరోవైపు పాదచారులను సైతం భయాందోళనకు గురి చేస్తున్నాయి. రాత్రి వేళలో కాకుండా పగటి పూట గుంపులుగా రోడ్లపై మకాం వేస్తున్నాయి.


jmt2.jpgవివిధ పనుల నిమిత్తం హుస్నాబాద్‌, హుజూరాబాద్‌, కరీంనగర్‌, హన్మకొండ పట్టణాలతోపాటు ఇతర ప్రాంతాలకు వెళ్లి రాత్రి బైక్‌పై తిరిగి వస్తుంటారు. హుస్నాబాద్‌ నుంచి సైదాపూర్‌ మీదుగా హుజూరాబాద్‌కు రాత్రింబవళ్లు వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. ఎలబోతారం, చింత పల్లి, జాగీర్‌పల్లి, రాంచంద్రాపూర్‌, దుద్దెనపల్లి, సైదాపూర్‌, వెన్కేపల్లి గ్రామాలతోపాటు ఎల బోతారం-బొమ్మకల్‌, సైదాపూర్‌-రాయికల్‌, సైదా పూర్‌- వెన్నంపల్లి రోడ్డులో కుక్కలు వెంట పడుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. గ్రామాల్లోని లేగదూడలు, మేకలు, గొర్రెలు, కోళ్లపై దాడి చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్షణకోసం మూగ జీవాలకు జాలీలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.


zz.jpg

  • కోతులతో కష్టాలు

మండలంలోని పలు గ్రామాల్లో కోతుల బెడద నెలకొంది. ఇళ్లపై తిష్టవేస్తున్నాయి. గుంపులుగా తిరుగుతూ భయందోళనకు గురిచేస్తున్నాయి. తలుపు తీసి ఉంటే సామగ్రి చిందరవందర చేస్తున్నాయి. ఎప్పుడూ కర్రతో ఉండాల్సిన పరిస్థితి.


ఈ వార్తలు కూడా చదవండి:

రికార్డు స్థాయిలో పడిపోతున్న బంగారం ధరలు

రైస్ మిల్లర్ల ఆటకు ఇక బ్రేక్..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 30 , 2026 | 11:02 AM