ఒంగోలులో దారుణం... బాలికపై రిటైర్డ్ ఉద్యోగి అత్యాచారయత్నం
ABN , Publish Date - Sep 30 , 2026 | 09:49 AM
ఒంగోలులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలికపై రిటైర్డ్ ఉద్యోగి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఓ వసతి గృహంలో బాలిక ఉంటోంది.
ప్రకాశం జిల్లా, సెప్టెంబర్ 30 (ఆంధ్రజ్యోతి): ఒంగోలులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలికపై రిటైర్డ్ ఉద్యోగి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఓ వసతి గృహంలో ఉంటున్న బాలికలను తండ్రి డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తానంటూ హాస్టల్ నుంచి బయటకు వంట మనిషి తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే బాలికలను రిటైర్డ్ ఉద్యోగి ఇంటి వద్ద వంట మనిషి వదిలివెళ్లింది. అయితే, బాలికలను ఇంట్లో బంధించినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే బంధువులకు మరో బాలిక ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. బంధువులకు ఫోన్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అతడి ఇంట్లో ఉన్న మరో బాలికను బంధువులు కాపాడారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. రిటైర్డ్ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. డీఆర్డీఏలో పనిచేసి అతడు రిటైర్ అయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ఒంగోలు పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉద్యోగుల్లో సామర్థ్యాలను పెంచడమే ‘మిషన్ కర్మయోగి’ లక్ష్యం: సీఎం చంద్రబాబు
తిరుమలేశుడిని దర్శించుకున్న మంత్రి లోకేశ్, హోం మంత్రి షణ్ముగం
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయాలి: మంత్రి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News