Share News

స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిచెప్పిన పోరాటం ‘సాగరహారం’: కేటీఆర్

ABN , Publish Date - Sep 30 , 2026 | 09:45 AM

తెలంగాణ స్వరాష్ట్రం కోసం నగరంలోని హుస్సేన్‌సాగర్ తీరాన చేసిన చరిత్రాత్మక సాగహారానికి నేటితో 14 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా స్పందించారు.

స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిచెప్పిన పోరాటం ‘సాగరహారం’: కేటీఆర్
KTR

హైదరాబాద్, సెప్టెంబర్ 30: తెలంగాణ స్వరాష్ట్రం కోసం నగరంలోని హుస్సేన్‌సాగర్ తీరాన చేసిన చరిత్రాత్మక సాగహారానికి నేటితో 14 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా స్పందించారు. స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిచెప్పిన పోరాట రూపం సాగరహారమని అన్నారు. ఆంక్షలను, నిర్బంధాలను, ముళ్లకంచెలను, లాఠీఛార్జీలను, రబ్బర్ బుల్లెట్లను లెక్క చేయకుండా.. ఉమ్మడి పాలకుల కుట్రలను తిప్పికొట్టారని తెలిపారు. ఉద్యమకారులు, తెలంగాణవాదులు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన చారిత్రక ఘట్టం సెప్టెంబర్ 30, 2012 నాటి సాగరహారమని వెల్లడించారు. సబ్బండ వర్గాలు హుస్సేన్‌సాగర్ తీరాన చేసిన చరిత్రాత్మక సాగరహారానికి 14 ఏళ్లు నిండిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఎక్స్‌లో కేటీఆర్ పోస్ట్ చేశారు.


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 2012, సెప్టెంబర్ 30న నిర్వహించిన సాగరహారంతో భాగ్యనగరం రణరంగంగా మారింది. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మిలియన్ మార్చ్ తర్వాత అంత గొప్పగా జరిగిన నిరసన కార్యక్రమం సాగరహారం. పోలీసుల లాఠీఛార్జ్, బాష్పవాయు ప్రయోగాలను లెక్కచేయకుండా, బారికేడ్లను తొలగించి లక్షలాది మంది తెలంగాణవాదులు సాగరహారానికి తరలివచ్చారు. ఎలాంటి హింసామార్గాన్ని చేపట్టకుండా తెలంగాణవాదులు సాగరహారాన్ని విజయవంతం చేశారు. ఆ తరువాత 2013 జూలై 30న తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది.


ఇవి కూడా చదవండి...

ఆసియా క్రీడలు: చైనా చిత్తు.. ఆర్చరీలో భారత్‌కు స్వర్ణం

డేటింగ్‌ యాప్‌లో పరిచయం.. పబ్‌లో రూ.29,884 బిల్లు!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 30 , 2026 | 10:00 AM