Share News

ఆసియా క్రీడలు: చైనా చిత్తు.. ఆర్చరీలో భారత్‌కు స్వర్ణం

ABN , Publish Date - Sep 30 , 2026 | 08:09 AM

ఆర్చరీలో బుధవారం భారత్‌కు స్వర్ణం దక్కింది. మహిళల కాంపౌండ్ ఆర్చరీ ఫైనల్ టీమ్ ఈవెంట్‌లో ఏపీకి చెందిన జ్యోతి సురేఖ, తెలంగాణకు చెందిన చికిత రావు, మహారాష్ట్రకు చెందిన ప్రీతిక త్రయం చైనా జట్టును ఓడించి గోల్డ్ మెడల్ సాధించింది.

ఆసియా క్రీడలు: చైనా చిత్తు.. ఆర్చరీలో భారత్‌కు స్వర్ణం
Archery Gold Medal

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడలు-2026లో భారత్‌ పసిడి వేట కొనసాగుతోంది. ఆర్చరీలో భారత మహిళల కాంపౌండ్‌ టీమ్‌ అదరగొట్టింది. బుధవారం జరిగిన ఫైనల్లో ఏపీకి చెందిన జ్యోతి సురేఖ, తెలంగాణకు చెందిన చికిత, మహారాష్ట్రకు చెందిన ప్రీతిక ప్రదీప్ బృందం చైనాపై 238-234 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అంతేకాదు.. ప్రపంచ రికార్డు స్కోరుతో ఈ ఘనత సాధించడం విశేషం. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన భారత జట్టు.. చైనాపై ఏమాత్రం తడబడకుండా పసిడిని నిలబెట్టుకుంది.


ప్రపంచ రికార్డు..

భారత బృందం సెమీఫైనల్లో దక్షిణ కొరియాను ఓడించి ఫైనల్‌కు చేరింది. తుది పోరులో చైనాను ఢీకొన్న భారత ఆర్చర్లు 238 పాయింట్లు సాధించారు. గతంలో 2014 ఆసియా క్రీడల్లో దక్షిణ కొరియా నెలకొల్పిన 238 పాయింట్ల ప్రపంచ రికార్డును భారత్‌ సమం చేసింది. ఈ విజయంతో ప్రస్తుత ఆసియా క్రీడల్లో భారత్‌ ఖాతాలో ఏడో స్వర్ణం చేరింది. మొత్తంగా భారత పతకాల సంఖ్య 53కు చేరింది. ఇందులో 7 స్వర్ణాలు, 21 రజతాలు, 25 కాంస్యాలు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

వన్డే ప్రపంచ కప్: జడేజాకు అవకాశం ఇస్తారా? కోచ్ ఏమన్నారంటే..

ఆసియా క్రీడలు: వర్షంతో టోర్నీ నుంచి ఔట్.. మలేసియా క్రికెటర్ ఎమోషనల్ పోస్ట్

Updated Date - Sep 30 , 2026 | 08:45 AM