Share News

వైసీపీ హయాంలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు.. విచారణకు జనసేన నేత డిమాండ్

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:29 AM

వైసీపీ నేతలపై జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శాప్ కార్యాలయం వద్ద వైసీపీ పెద్దలు రణరంగం చేశారని విమర్శించారు.

వైసీపీ హయాంలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు.. విచారణకు జనసేన నేత డిమాండ్
Janasena leader

గుంటూరు జిల్లా, సెప్టెంబర్ 30: వైసీపీ నేతలపై జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. శాప్ కార్యాలయం వద్ద వైసీపీ పెద్దలు రణరంగం చేశారని విమర్శించారు. డీఎస్సీలో 372 పోస్ట్‌లను అమ్ముకున్నారంటూ కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలు పొందిన వారే రోడ్లు మీదకి వచ్చి డీఎస్సీలో అక్రమాలు జరగలేదని చెప్తున్నారని తెలిపారు.


గత వైసీపీ ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగాలు కల్పించారని.. అయితే ఆ పార్టీ కోసం పని చేసిన వారికి మాత్రమే అప్పుడు ఉద్యోగాలు ఇచ్చారని గాదె ఆరోపించారు. సచివాలయాల్లో 3677 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారని.. ఆ ఉద్యోగాలకు సంబంధించిన సర్టిఫికెట్లు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వంలో స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన ఉద్యోగాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరారు. లేదంటే కోర్టు ద్వారా తేల్చుకుంటామని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

డేటింగ్‌ యాప్‌లో పరిచయం.. పబ్‌లో రూ.29,884 బిల్లు!

స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిచెప్పిన పోరాటం ‘సాగరహారం’: కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 30 , 2026 | 11:35 AM