Share News

‘సిరిసిల్లలో చేసిన అభివృద్ధిలో పదిశాతం చేయగలరా’.. సీఎం రేవంత్‌కు పాడి కౌశిక్ సవాల్

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:28 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ సీఎం అంటూ వ్యాఖ్యానించారు.

‘సిరిసిల్లలో చేసిన అభివృద్ధిలో పదిశాతం చేయగలరా’.. సీఎం రేవంత్‌కు పాడి కౌశిక్ సవాల్
Padi Kaushik Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 30: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ సీఎం అంటూ వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కట్టిన వాటికి రేవంత్ రిబ్బన్ కట్ చేస్తున్నారని విమర్శించారు. కరీంనగర్ కలెక్టరేట్ కేసీఆర్ ఆనవాళ్లు కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని.. ఆయన కట్టినవే ప్రారంభిస్తున్నారని మండిపడ్డారు.


తెలంగాణలో కాంగ్రెస్ తల్లిని నిలబెట్టారని ఎమ్మెల్యే అన్నారు. రెండు సంవత్సరాల్లో మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తల్లిని ప్యాక్ చేసి గాంధీ భవన్‌కు పంపుతామన్నారు. సిరిసిల్లలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సభకు జనం రావడం లేదని అన్నారు. సిరిసిల్లలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన అభివృద్ధిని సీఎం రేవంత్ రెడ్డి చూడాలన్నారు. సిరిసిల్ల అభివృద్ధిలో పదిశాతం కొడంగల్‌లో చేసి చూపెట్టాలని సవాల్ విసిరారు. రేవంత్ సొంత గ్రామంలో కరెంట్ ఇవ్వడం లేదని పాడి కౌశిక్ రెడ్డి విమర్శలు గుప్పించారు.


ఇవి కూడా చదవండి...

ఆసియా క్రీడలు: చైనా చిత్తు.. ఆర్చరీలో భారత్‌కు స్వర్ణం

డేటింగ్‌ యాప్‌లో పరిచయం.. పబ్‌లో రూ.29,884 బిల్లు!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 30 , 2026 | 12:35 PM