Share News

ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల ఆర్చరీ జట్టుకు స్వర్ణం.. మంత్రి మండిపల్లి అభినందనలు

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:54 AM

ఏషియన్ గేమ్స్-2026లో భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు స్వర్ణ పతకం సాధించడంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్‌లో చైనాను 238-234తో ఓడించి స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల ఆర్చరీ జట్టుకు అభినందనలు తెలియజేశారు.

ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల ఆర్చరీ జట్టుకు స్వర్ణం.. మంత్రి మండిపల్లి అభినందనలు
Minister Mandipalli Ramprasad reddy

అమరావతి, సెప్టెంబర్ 30: ఏషియన్ గేమ్స్-2026లో భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు స్వర్ణ పతకం సాధించడంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్‌లో చైనాను 238-234తో ఓడించి స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల ఆర్చరీ జట్టుకు అభినందనలు తెలియజేశారు. భారత జట్టు అద్భుత ప్రదర్శన దేశానికి గర్వకారణమని కొనియాడారు. ఏషియన్ గేమ్స్ (2023-26 కలిపి)లో భారత ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ.. నాలుగు స్వర్ణ పతకాలను సాధించడంపై ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. రాష్ట్రానికి చెందిన జ్యోతి సురేఖ అంతర్జాతీయ వేదికపై వరుస విజయాలతో భారత క్రీడా ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారని ప్రశంసించారు. జ్యోతి సురేఖతో పాటు భారత మహిళల ఆర్చరీ జట్టు సభ్యులకు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తు పోటీల్లోనూ భారత క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు.


యువ క్రీడాకారులకు జ్యోతి సురేఖ స్ఫూర్తిదాయకం: రవి నాయుడు

ఏషియన్ గేమ్స్ 2026లో భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు స్వర్ణ పతకం సాధించిందని శాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు. జట్టులో భాగమైన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖకు ఇది ఏషియన్ గేమ్స్‌లో 4వ స్వర్ణ పతకమన్నారు. జ్యోతి సురేఖతో పాటు భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టులో భాగమైన చికితా తనప, ప్రతికా ప్రదీప్‌కు అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ ఆర్చరీ వేదికపై జ్యోతి సురేఖ తన ప్రతిభతో భారతదేశం, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. యువ క్రీడాకారులకు జ్యోతి సురేఖ స్ఫూర్తిదాయకమని శాప్ చైర్మన్ రవి నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిచెప్పిన పోరాటం ‘సాగరహారం’: కేటీఆర్

వైసీపీ హయాంలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు.. విచారణకు జనసేన నేత డిమాండ్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 30 , 2026 | 11:54 AM