ఆసియా క్రీడలు: కాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు మరో స్వర్ణం
ABN , Publish Date - Sep 30 , 2026 | 10:10 AM
ఆసియా క్రీడలు 2026లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. కాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు మరో స్వర్ణ పతకం లభించింది. మిక్స్‌డ్ టీమ్ విభాగంలో చికితా తానిపర్తి, సాహిల్ జాదవ్ జోడీ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడలు 2026లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. కాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు మరో స్వర్ణ పతకం లభించింది. మిక్స్‌డ్ టీమ్ విభాగంలో చికితా తానిపర్తి, సాహిల్ జాదవ్ జోడీ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో కొరియాకు చెందిన పార్క్ జంగ్యూన్, చోయ్ యోంగ్‌హీ జోడీని షూట్‌ఆఫ్‌లో ఓడించి భారత్ స్వర్ణం సాధించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ 157-157తో సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు షూట్‌ఆఫ్ నిర్వహించారు. ఈ సమయంలో చికిత, సాహిల్ ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా బుల్స్‌ఐని కొట్టారు. కొరియా తొలి ప్రయత్నంలో 9 పాయింట్లు మాత్రమే సాధించడంతో భారత్ స్వర్ణం ఖరారైంది.
ఫైనల్లో భారత్ ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి సెట్‌ను 40-39తో గెలిచిన చికిత, సాహిల్ జోడీ.. రెండో సెట్‌లోనూ 40-39తో విజయం సాధించింది. దీంతో భారత్ 80-78తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే కొరియా జోడీ పుంజుకుని.. మూడో సెట్‌ను 39-38తో, నాలుగో సెట్‌ను 40-39తో సొంతం చేసుకుంది. దీంతో మొత్తం స్కోరు 157-157తో సమమైంది. చివరకు షూట్‌ఆఫ్‌లో భారత్ విజేతగా నిలిచింది. ఈ స్వర్ణంతో భారత్ ఖాతాలో పతకాల సంఖ్య 55కు చేరింది. ఇందులో ఎనిమిది స్వర్ణాలు ఉన్నాయి. అంతేకాదు.. ఈ విజయంతో 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు భారత్ తన కోటాను కూడా ఖరారు చేసుకుంది.
అంతకుముందు మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలోనూ భారత్ స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. చికిత తానిపర్తి, జ్యోతి సురేఖ, ప్రతీకా ప్రదీప్ బృందం ఫైనల్లో చైనాను 238-234తో ఓడించింది. అయితే గంటల వ్యవధిలోనే బ్యాక్ టూ బ్యాక్ ఆర్చరీలో రెండు స్వర్ణాలు రావడం విశేషం.
ఇవి కూడా చదవండి:
వన్డే ప్రపంచ కప్: జడేజాకు అవకాశం ఇస్తారా? కోచ్ ఏమన్నారంటే..
ఆసియా క్రీడలు: వర్షంతో టోర్నీ నుంచి ఔట్.. మలేసియా క్రికెటర్ ఎమోషనల్ పోస్ట్