Share News

వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్‌ కేసు

ABN , Publish Date - Sep 30 , 2026 | 06:30 AM

‘వీరమాచినేని డైట్‌’, ‘వీఆర్‌కే డైట్‌’ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి సుపరిచితుడైన వీరమాచినేని రామకృష్ణపై సైబరాబాద్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్‌ కేసు
Veeramachineni Ramakrishna

  • ఆయన డైట్‌తో అనారోగ్యం పాలైన న్యాయ విద్యార్థి

  • సైబరాబాద్‌ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు29 (ఆంధ్రజ్యోతి): ‘వీరమాచినేని డైట్‌’, ‘వీఆర్‌కే డైట్‌’ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి సుపరిచితుడైన వీరమాచినేని రామకృష్ణపై సైబరాబాద్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు తెలిసింది. కొవ్వు, ప్రొటీన్‌ ఆధారిత ఆహారంతో ఎలాంటి అనారోగ్యాన్ని అయినా నయం చేస్తానంటూ ఆయన సోషల్‌ మీడియా వేదికగా సవాల్‌ చేస్తుంటారని తెలిసిందే. మధుమేహంతో బాధపడుతున్న 30ఏళ్ల ఒక న్యాయ విద్యార్థి ఈ వీడియోలను చూసి ఇటీవల వీరమాచినేని రామకృష్ణను సంప్రదించారు.


రామకృష్ణతో పాటు కోటేశ్వరరావు కలిసి టైప్‌-1 డయాబెటిస్‌ నయం చేస్తామని కొన్ని ఆరోగ్య చిట్కాలు చెప్పారు. ఇన్సులిన్‌తో పాటు ఇతర మందులు వాడొద్దని, తమ చిట్కాలు మాత్రమే పాటించాలని సూచించారు. అందుకు రూ.26వేలు ఫీజు తీసుకున్నారు. వారి సూచనల మేరకు చిట్కాలు పాటించిన న్యాయ విద్యార్థి కేవలం రెండు రోజుల్లోనే అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. దీంతో బాధితుడు సైబరాబాద్‌ పోలీసులను ఆశ్రయించి వీరమాచినేని రామకృష్ణ చెప్పిన ఆరోగ్య చిట్కాల వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందని ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

Updated Date - Sep 30 , 2026 | 06:30 AM