Share News

హైదరాబాద్‌లో కలకలం.. కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:08 PM

హైదరాబాద్‌లోని మెహదీపట్నం పరిధిలో మహిళ మృతదేహం కలకలం రేపింది. హబీబ్‌నగర్ చార్కాంధీల్ చౌరస్తా సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో మహిళ డెడ్‌బాడీ లభించడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లో కలకలం.. కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం
Mehdipatnam

హైదరాబాద్‌, సెప్టెంబర్ 30: నగరంలోని మెహదీపట్నంలో మహిళ మృతదేహం కలకలం రేపింది. హబీబ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చార్మినార్‌ చౌరస్తా సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో మహిళ డెడ్‌బాడీ లభ్యమైంది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించిన పోలీసులు..మృతురాలి వివరాలు, ఆమె అక్కడికి ఎలా చేరుకుంది అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.


మరోవైపు.. క్లూస్‌ టీమ్‌ ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలను సేకరించింది. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో ఘటన ఎప్పుడు జరిగి ఉండొచ్చనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదమా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి.. నివేదిక ఆధారంగా మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఘటనపై హబీబ్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిచెప్పిన పోరాటం ‘సాగరహారం’: కేటీఆర్

వైసీపీ హయాంలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు.. విచారణకు జనసేన నేత డిమాండ్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 30 , 2026 | 01:19 PM