ఆసియా క్రీడల్లో స్వర్ణం.. చికిత, సాహిల్‌కు సీఎం రేవంత్ అభినందనలు
ABN , Publish Date - Sep 30 , 2026 | 01:59 PM
ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన చికిత, సాహిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. అసియా క్రీడల్లో తెలంగాణ ఆర్చరీ క్రీడాకారిణి చికిత స్వర్ణ పతకాన్ని సాధించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 30: ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన చికిత, సాహిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఆసియా క్రీడల్లో తెలంగాణ ఆర్చరీ క్రీడాకారిణి చికిత స్వర్ణ పతకాన్ని సాధించింది. మిక్స్‌డ్ కాంపౌండ్ ఆర్చరీలో చికిత-సాహిల్ జోడీకి గోల్డ్ వరించింది. దీంతో ఒకేరోజు రెండు స్వర్ణాలు సాధించిన చికిత.. 2028 లాస్‌ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో ఆసియా క్రీడల్లో సర్ణం సాధించిన పెద్దపల్లికి చెందిన చికిత ప్రతిభపై ముఖ్యమంత్రి ప్రశంసలు కురిపించారు. చికిత విజయం తెలంగాణ క్రీడా చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. చికిత పట్టుదల క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
‘సిరిసిల్లలో చేసిన అభివృద్ధిలో పదిశాతం చేయగలరా’.. సీఎం రేవంత్‌కు పాడి కౌశిక్ సవాల్
‘గ్రామసభల నిర్ణయాలకు ప్రాధాన్యం’.. వీబీ జీ రామ్ జీ అమలుపై మంత్రి సీతక్క సమీక్ష
Read Latest Telangana News And Telugu News