Share News

సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే.. భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్

ABN , Publish Date - Sep 30 , 2026 | 01:00 PM

70 ఏళ్లుగా కులాలు, ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చుపెట్టిందే కాంగ్రెస్ అంటూ టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాశ్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కొత్తగా దేవుళ్లలో పేద, ధనిక నిర్వచనం తీసుకొచ్చారని విమర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే.. భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్
Bhanu Prakash Reddy

ఢిల్లీ, సెప్టెంబర్ 30: 70 ఏళ్లుగా కులాలు, ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చుపెట్టిందే కాంగ్రెస్ అంటూ టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాశ్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. ఈ రోజు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్.. కొత్తగా దేవుళ్లలో పేద, ధనిక నిర్వచనం తీసుకొచ్చారని విమర్శించారు. ధనం మీద ధ్యాస ఉండే వారికి అదే కనిపిస్తుందన్నారు. ధనం కోసం పనిచేసేది కాంగ్రెస్ పార్టీ అని.. ధర్మం, దేశం కోసం పరితపించేది బీజేపీ అని వ్యాఖ్యానించారు.


ప్రధాని నరేంద్ర మోదీ ఏ రోజైనా 'హర హర మహాదేవ' అని అన్నాడా అని రేవంత్ అంటున్నారని.. ప్రధాని గెలిచింది సాక్షాత్తు ఈశ్వరుడు ఉన్న ప్రాంతం కాశీ నుంచేనని భానుప్రకాశ్ చెప్పుకొచ్చారు. 'ముఖ్యమంత్రికి మతిభ్రమించిందా' అని ప్రశ్నించారు. సీఎం కుర్చీని కాపాడుకోవడం కోసం సోనియా, రాహుల్ గాంధీ కళ్లలో ఆనందం కోసం రేవంత్ ఇలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగా హిందూ దేవుళ్లపై విద్వేష ప్రసంగాలు చేస్తున్న సీఎం.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు భానుప్రకాశ్.


'భగవంతుడు ఉండేదే లోక కళ్యాణం కోసం' అని చెప్పిన భానుప్రకాశ్.. కేరళం, ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడారని మండిపడ్డారు. నోటికి వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలే తరిమికొడతారని హెచ్చరించిన ఆయన.. విద్వేషాలు సృష్టించడం మానుకోవాలని హితవు పలికారు. ఎర్రకోటపై త్రివర్ణ పతాకన్ని ఎగురవేసేది ప్రధాని మోదీ, బీజేపీనే అని స్పష్టం చేశారు. బయటి దేశాలవారు కూడా ప్రధాని మోదీని ఎంతగానో ప్రశంసిస్తున్నారని భానుప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

డేటింగ్‌ యాప్‌లో పరిచయం.. పబ్‌లో రూ.29,884 బిల్లు!

‘సిరిసిల్లలో చేసిన అభివృద్ధిలో పదిశాతం చేయగలరా’.. సీఎం రేవంత్‌కు పాడి కౌశిక్ సవాల్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 30 , 2026 | 03:34 PM