Share News

రోడ్డు ప్రమాద బాధితులకు భరోసా పీఎం రాహత్‌

ABN , Publish Date - Oct 02 , 2026 | 11:51 AM

రోడ్డు ప్రమాదంలో ఎందరో ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి సరైన సమయంలో వైద్యం అందితే ప్రాణాలు కాపాడవచ్చు.

రోడ్డు ప్రమాద బాధితులకు భరోసా పీఎం రాహత్‌
PM Rahat Scheme

  • రూ. 1.50 లక్షల వరకు నగదు రహిత చికిత్స

ఇల్లందకుంట(కరీంనగర్): రోడ్డు ప్రమాదంలో ఎందరో ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి సరైన సమయంలో వైద్యం అందితే ప్రాణాలు కాపాడవచ్చు. రోడ్డు ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్‌ అవర్‌ అంటారు. ఈ సమయంలో సరైన వైద్యం అందితే దాదాపు 50 శాతం మరణాలను నివారించవచ్చు. ఈ ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం పీఎం రాహ త్‌ (రోడ్‌ ఆక్సిడెంట్‌ విక్టిమ్‌ హాస్పిటలైజేషన్‌ అండ్‌ అస్యూర్‌డ్‌ ట్రీట్‌మెంట్‌) పథకాన్ని ప్రవేశపెట్టింది. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణమే ఉచి తంగా నగదు రహిత వైద్య చికిత్స అందిస్తుంది.


  • పథకం వివరాలు...

ప్రమాదానికి గురైన ప్రతి బాధితుడికి గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు ఉచితంగా నగదు రహిత వైద్యం అందుతుంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, నగరాల్లో సాధారణ రోడ్లు, ఇలా ఏ కేటగిరి రోడ్డుపై ప్రమాదం జరిగినా ఈ పథకం వర్తిస్తుంది.


jjmt1.jpg

  • అర్హత...

భారతదేశంలోని పౌరులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. దీని కోసం ముందుగా ఎలాంటి రిజిస్ర్టేషన్‌, ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. హాస్పిటల్‌లో ఆధార్‌ కార్డు, ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు ద్వారా ధ్రువీకరణ చేస్తారు.


  • హెల్ప్‌లైన్‌ నంబర్‌ 112 ..

ప్రమాదం జరిగిన వెంటనే బాధితులు, అక్కడ ఉన్న ఎవరైనా 112 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫోన్‌చేసి అంబులెన్స్‌ సహాయాన్ని, అలాగే దగ్గరలోని గుర్తించబడిన ఆసుపత్రి వివరాలను పొందవచ్చు. ఆసుపత్రులకు అయ్యే ఖర్చులను ప్రభుత్వం మోటార్‌ వెహికిల్‌ యాక్సిడెంట్‌ ఫండ్‌ ద్వారా చెల్లిస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

అందుకే పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

హ్యాపీ జర్నీ.. ఆర్టీసీ, మెట్రో ఉమ్మడి పాస్‌ నేటి నుంచి అమలులోకి..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 11:51 AM