నవ్వు..నవ్వించు..
ABN , Publish Date - Oct 02 , 2026 | 11:19 AM
నవ్వడం ఒక యోగం... న వ్వించడం ఒక భోగం... నవ్వకపోవడం ఒక రోగం... అంటారు పెద్దలు. ఎంతటి శత్రువునైనా నవ్వుతో పలకరిస్తే జయించవచ్చునంటాడు ఓ మహాకవి.
నేడు ప్రపంచ చిరునవ్వుల దినోత్సవం
కరీంనగర్ కల్చరల్: నవ్వడం ఒక యోగం... న వ్వించడం ఒక భోగం... నవ్వకపోవడం ఒక రోగం... అంటారు పెద్దలు. ఎంతటి శత్రువునైనా నవ్వుతో పలకరిస్తే జయించవచ్చునంటాడు ఓ మహాకవి. నవ్వుతో ప్రపంచాన్నే జయించవచ్చునంటాడు మరో కవి.
నవ్వు వ్యక్తి ముఖ కవళి కలు, భావోద్వేగాలపై ప్రభా వం చూపుతాయి. వరంలాంటి నవ్వు నిండు ముఖానికి ఎంతో అందం, ఆనందం, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. పూర్వం మనుషులు పరస్పరం పలకరించుకుంటున్నప్పుడు చిరునవ్వుతో ముఖాలు చూసుకొని, ఆ తర్వాత నమస్కరించుకొని మాట్లాడుకునేవారని తెలుస్తోంది. నేటి యాంత్రిక జీవితంలో నిత్యం ఎంతో కొంతసేపు నవ్వితేగాని ఆయుష్షు, ఆరోగ్యం, ఆనందం, ప్రేమాభిమానాలు అందకుండా పోయాయి. ఈ దిశలో ప్రపంచ చిరు నవ్వుల దినోత్సవాన్ని ప్రతీ యేటా అక్టోబరు తొలి శుక్రవారం జరుపుకుంటారు.
నేపథ్యం...
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పసుపు రంగు స్మైలీ ఫేస్ (సింబల్ ఫేస్) ఐకాన్‌ను 1963 లో కనుగొన్న అమెరికన్ గ్రాఫిక్ ఆర్టిస్ట్ హార్వే బాల్ చొరవతో ఈ రోజును ప్రారంభించారు. ఆయన జ్ఞాపకార్థం 1999 నుంచి ప్రతీ యేటా ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఒక చిరునవ్వు, చిన్నపాటి దయాగుణంతో కూడిన పనులు జీవితంలో ఎంతటి సంతోషాన్ని నింపగలవో తెలియ జేయ డమే ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం.
నవ్వుతో ప్రయోజనాలు...
నవ్వు మన శరీరంలో సానుకూల రసాయనా లను విడుదల చేస్తుంది. మానసిక స్థితిని మెరు గుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. సంతోషంగా ఉండేందుకు సహకరిస్తుంది. ప్రపంచశాంతి పెంపొందించేందుకు తోడ్పడుతుంది. గాఢమైన నవ్వులోతైన శ్వాసను ఉత్తేజపరచి ఆక్సీజన్ ప్రవాహం పెంచుతుంది. కండరాలను సడలించడానికి కారణమౌతుంది. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. నిరాశా భావాల్ని ఎదుర్కోవడంలో సహకరిస్తుంది. విభిన్న సంస్కృతులు, నేపథ్యాల ప్రజలను ఏకం చేస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
అందుకే పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
హ్యాపీ జర్నీ.. ఆర్టీసీ, మెట్రో ఉమ్మడి పాస్ నేటి నుంచి అమలులోకి..
Read Latest AP News And Telangana News And International News And Telugu News