Share News

నెల్లూరు పాలిటెక్నిక్ కాలేజీలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు: మంత్రి నారాయణ

ABN , Publish Date - Oct 02 , 2026 | 10:22 AM

ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ - స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ప్రజలందరి సహకారం అవసరమని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ అన్నారు. స్వచ్ఛాంధ్ర కింద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

నెల్లూరు పాలిటెక్నిక్ కాలేజీలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు: మంత్రి నారాయణ
AP Minister Narayana

నెల్లూరు, అక్టోబర్ 02: ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ - స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ప్రజలందరి సహకారం అవసరమని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ అన్నారు. స్వచ్ఛాంధ్ర కింద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందుకోసం ప్రతి నెలలో ఓ రోజను సీఎం చంద్రబాబు నాయుడు కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. శుక్రవారం నెల్లూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో స్వచ్ఛ భారత్ - స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మొక్కలు నాటారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 135 లక్షల టన్నుల చెత్తని వదిలేసి వెళ్లింది. అవన్నీ క్లియర్ చేస్తున్నామని పేర్కొన్నారు.


వైజాగ్, గుంటూరులో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పని చేస్తున్నాయని వివరించారు. ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. వెంటనే పనులు ప్రారంభించి.. మూడు దశల్లో ఆ పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని గొడ్డలి పార్టీ ఆర్ధికంగా దివాలా తీయించిందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని వివరించారు. పేదలకి శాశ్వత నివాస పత్రాలు ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం పట్టాల పేరుతో మోసం చేసిందంటూ వైసీపీపై మంత్రి నారాయణ నిప్పులు చెరిగారు.


ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి మహర్దశ: ఎమ్మెల్సీ బీద రవిచంద్ర

ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తెలిపారు. రాష్ట్రంలోని విద్యా సంస్థలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నారంటూ మంత్రి నారాయణపై ప్రశంసల జల్లు కురిపించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌తో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి మహర్దశ వస్తుందని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహాత్మా గాంధీ చూపిన మార్గంలో పయనిద్దాం: మంత్రి లోకేశ్

సుప్రీంకోర్టులో 250 జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత

For More AP News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 10:28 AM