Share News

మహాత్మా గాంధీ చూపిన మార్గంలో పయనిద్దాం: మంత్రి లోకేశ్

ABN , Publish Date - Oct 02 , 2026 | 06:59 AM

భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ ఘనంగా నివాళులర్పించారు.

మహాత్మా గాంధీ చూపిన మార్గంలో పయనిద్దాం: మంత్రి లోకేశ్
AP Minister Nara Lokesh

అమరావతి, అక్టోబర్ 02: భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ ఘనంగా నివాళులర్పించారు. ‘మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరిస్తూ నివాళులు అర్పిస్తున్నాను. మన దేశ స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి బాపూజీ చూపిన శాంతి, సహన, సత్య మార్గంలో పయనిద్దాం. గాంధీజీ కలలుగన్న సమానత్వం, గ్రామ స్వరాజ్యం, స్వావలంబన, స్వచ్ఛత సాధించి, ఆ మహాత్ముని ఆశయాల సాకారానికి కృషి చేద్దామని’ ఆయన పేర్కొన్నారు.


అదే మహాత్మా గాంధీకి ఇచ్చే నిజమైన నివాళి: ఏపీ టీడీపీ చీఫ్

అహింస, సత్యాగ్రహం, శాంతి మార్గాలను ఆయుధాలుగా మలిచి దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీ సాగించిన పోరాటం యావత్‌ ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. సత్యం, అహింస, సేవ, స్వచ్ఛత వంటి విలువలను ఆచరణలో చూపిన గాంధీజీ ఆశయాలు నేటి తరానికి కూడా మార్గదర్శకమని చెప్పారు. సమాజంలో సమానత్వం, సామరస్యం, సోదరభావం వెల్లివిరియాలన్న ఆయన ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడమే మహాత్మా గాంధీకి ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులర్పిస్తున్నానని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దేశం గర్వించేలా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తాం: ఎంపీ శివనాథ్

అనంతబాబుకు చుక్కెదురు

Updated Date - Oct 02 , 2026 | 09:07 AM