Share News

దేశం గర్వించేలా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తాం: ఎంపీ శివనాథ్

ABN , Publish Date - Oct 02 , 2026 | 06:31 AM

దేశం గర్వించేలా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తామని తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వ్యాఖ్యానించారు. ఈ ఉత్సవ్‌ను నగరవాసులంతా ఆస్వాదించాలని పిలుపునిచ్చారు.

దేశం గర్వించేలా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తాం: ఎంపీ శివనాథ్
TDP MP Kesineni Sivanath

విజయవాడ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): దేశం గర్వించేలా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తామని తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) (TDP MP Kesineni Sivanath) వ్యాఖ్యానించారు. ఈ ఉత్సవ్‌ను నగరవాసులంతా ఆస్వాదించాలని పిలుపునిచ్చారు. ఈరోజు (శుక్రవారం) స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర లక్ష్యంతో మారథాన్ నిర్వహించారు. క్లీన్ సొసైటీ, గ్రీన్ సొసైటీ నినాదాలతో మారథాన్‌ను ఎంపీ శివనాథ్ ప్రారంభించారు. ఈ రన్‌‌కు స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి, సీపీ రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, బోండా సిద్ధార్థ హాజరయ్యారు.


మారథాన్‌లో పాల్గొన్న 22 రాష్ట్రాల ప్రతినిధులు

జుంబా డ్యాన్స్‌తో యువతను అలరించారు. 5k, 10k రన్‌లో‌ 22 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. 22 రాష్ట్రాల నుంచి మారథాన్‌లో యువత ‌పాల్గొన్నారు. విజయవాడ ఉత్సవ్ 2.0 కర్టన్ రైజ్ వీడియోను భారీ స్క్రీన్ పై నిర్వాహకులు ప్రదర్శించారు. హర్ష ధ్వానాలతో యువత, ప్రజల నుంచి అపూర్వ స్పందన రావడం‌పై ఎంపీ శివనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడారు. విజయవాడలో ఏ కార్యక్రమం జరిగినా సూపర్‌హిట్ కావడం నగరవాసుల ప్రత్యేకత అని వివరించారు.


విజయవాడకు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తున్నాం..

విజయవాడకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తున్నామని ఎంపీ శివనాథ్ చెప్పుకొచ్చారు. విజయవాడ ఉత్సవం, స్వచ్ఛ మారథాన్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించిందని తెలిపారు. 22 రాష్ట్రాల నుంచి స్వచ్ఛ మారథాన్‌కు రిజిస్ట్రేషన్లు రావడం విజయవాడ ఘనత అని ఉద్ఘాటించారు. గత ఏడాది విజయవాడ ఉత్సవానికి ఉపరాష్ట్రపతిని ఆహ్వానించామని.. ఈసారి రాష్ట్రపతి హాజరుకానున్నారని తెలిపారు. అక్టోబర్ 14, 15వ తేదీల్లో రాష్ట్రపతి విజయవాడ పర్యటన ఖరారైందని వెల్లడించారు. పున్నమి ఘాట్, మాకినేని బసవపున్నయ్య స్టేడియం, సిద్ధార్థ కాలేజీలో విజయవాడ ఉత్సవ్ జరగనుందని ఎంపీ శివనాథ్ పేర్కొన్నారు.


స్వచ్ఛథాన్‌కు ప్రజల నుంచి అపూర్వ స్పందన: సీపీ రాజశేఖర్ బాబు

స్వచ్ఛథాన్ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చిందని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. యువత ఉత్సాహంగా ఈ ఈవెంట్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. విజయవాడలో ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరమని అన్నారు. ఈ రన్‌ను విజయవంతం చేసిన ప్రజలు, యువత, స్పాన్సర్స్‌లకు సీపీ రాజశేఖర్ బాబు ధన్యవాదాలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వర్ణాంధ్ర విజన్ - 2047 లక్ష్యంగా ఏపీ ముందుకెళ్తుంది: గవర్నర్ కంభంపాటి

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35.. ఒక్కో కార్డుదారుడికి 2 కిలోల పంపిణీ: మంత్రి నాదెండ్ల

ఒలింపిక్‌లో మెడల్ సాధించేలా ఏపీ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 07:05 AM