Share News

అనంతబాబుకు చుక్కెదురు

ABN , Publish Date - Oct 02 , 2026 | 06:20 AM

దళిత డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్‌ (అనంతబాబు)కు కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను రాజమహేంద్రవరం ప్రిన్సిపల్‌ డ్రిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు కొట్టివేసింది.

అనంతబాబుకు చుక్కెదురు

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): దళిత డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్‌ (అనంతబాబు)కు కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను రాజమహేంద్రవరం ప్రిన్సిపల్‌ డ్రిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు గురువారం న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా తీర్పు ఇచ్చారు. పిటిషనర్‌ తరఫున హైకోర్టు సీనియర్‌ న్యాయవాది సి.రఘు వాదన వినిపిస్తూ అనంతబాబుపై సర్పవరం పోలీ్‌సస్టేషన్‌లో ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. బాధితుల తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ముప్పాళ్ల సుబ్బారావు, న్యాయవాది ముప్పాళ్ల విశాల్‌ స్ఫూర్తి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయాధికారి బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేశారు.

ఈ వార్తలనూ చదవండి:

వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు

ప్రభుత్వ భూములకు స్కెచ్‌

Updated Date - Oct 02 , 2026 | 06:20 AM