Share News

సుప్రీంకోర్టులో 250 జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత

ABN , Publish Date - Oct 02 , 2026 | 07:55 AM

సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా గ్రూప్ బి నాన్ గెజిటెడ్ కేడర్‌లో 250 జూనియర్ కోర్టు అసిస్టెంట్ (JCA) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది.

సుప్రీంకోర్టులో 250 జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత

సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా గ్రూప్ బి నాన్ గెజిటెడ్ కేడర్‌లో 250 జూనియర్ కోర్టు అసిస్టెంట్ (JCA) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు అక్టోబర్ 28వ తేదీ.

పోస్టుల వివరాలు..

  • జూనియర్ కోర్టు అసిస్టెంట్ (గ్రూప్ బి నాన్ గెజిటెడ్): 250 పోస్టులు.

  • అర్హత: 2026 సెప్టెంబర్ 1 నాటికి అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు నిమిషానికి 35 పదాల ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ కలిగి ఉండాలి.

  • వయోపరిమితి: 01.09.2026 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగులకు సడలింపు ఉంటుంది.

  • జీతం: ప్రాథమిక వేతనం రూ. 35,400తోపాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.

  • ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీఎసీ: 3477 గ్రాడ్యుయేట్ ఉద్యోగాలు

  • ఎంపిక విధానం: నాలుగు దశల్లో జరుగుతుంది.


1)

ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ (100 మార్కులు, 1:301/2 గంటలు): జనరల్ ఇంగ్లీష్ (20), జనరల్ ఆప్టిట్యూడ్ (15), జనరల్ నాలెడ్జ్ (15), రాజ్యాంగంలోని న్యాయవ్యవస్థ నిబంధనలు (15), సుప్రీంకోర్టు రూల్స్ 2013 (10), సుప్రీంకోర్టు ఆఫీసర్సు అండ్ సర్వెంట్స్ రూల్స్ 1961 (10), కంప్యూటర్ పరిజ్ఞానం (15)లపై 100 ప్రశ్నలు ఉంటాయి. క్వాలిఫై మార్కులు 50. అబ్జెక్టివ్ పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కులు ఉంటాయి. ఈ పరీక్ష మార్కుల ఆధారంగా 1:10 నిష్పత్తిలో అభ్యర్థులను రెండవ దశ (టైపింగ్ అండ్ డిస్క్రిప్టివ్)కు ఎంపిక చేస్తారు.


2)

కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ (50 మార్కులు, 10 నిమిషాలు): ఇంగ్లీష్‌లో కనీసం 35 w.p.m. వేగం ఉండాలి (క్వాలిఫై మార్కులు: 25)


3)

రాత పరీక్ష డిస్క్రిప్టివ్ (100 మార్కులు, 2 గంటలు): ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ప్రిసిస్ రైటింగ్, ఎస్సే రైటింగ్(క్వాలిఫై మార్కులు: 50). టైపింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల డిస్క్రిప్టివ్ పేపర్లు మాత్రమే మూల్యాంకనం చేస్తారు.


4)

ఇంటర్వ్యూ (25 మార్కులు): క్వాలిఫై మార్కులు-13

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 1500, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మాజీసైనికోద్యోగులు/దివ్యాంగులకు రూ.750.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరణ ప్రారంభం: 07-10-2026

దరఖాస్తుకు తుది గడువు: 28-10-2026

అబ్జెక్టివ్ పరీక్ష తేదీ: 20-11-2026.

ఆన్సర్ కీ, అభ్యంతరాల తేదీలు: నవంబర్ 22, 23

ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ కేంద్రాలు: దేశంలోని 131 నగరాల్లో నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, నెల్లూర, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గంటూరు

టైపింగ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ: డిల్లీ.


null

ఈ వార్తలు కూడా చదవండి..

కెనరా బ్యాంకులో భారీగా అప్రెంటిస్‌ పోస్టులు.. నెలకు రూ.16,650 స్టైపెండ్!

రైల్వేలో 5,165 నాన్‌-టెక్నికల్‌ పోస్టులు..

Updated Date - Oct 02 , 2026 | 08:12 AM