Share News

అంచనాలకు అందని బంగారం ధరలు.. మదుపర్లకు చుక్కలు..

ABN , Publish Date - Oct 02 , 2026 | 10:32 AM

దేశంలో నేడు మేలిమి బంగారం ధర మరోసారి పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి దర రూ.1.5 లక్షల మార్కును చేరుకుంది.

అంచనాలకు అందని బంగారం ధరలు.. మదుపర్లకు చుక్కలు..
Gold, Silver Rates on Oct 2

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో బంగారం ధరల అంచనాలకు అందని రీతిలో మారుతున్నాయి. ఒక రోజు పెరిగితే ఆ మరుసటి రోజే తగ్గుతున్నాయి. నిన్న కాస్త తగ్గిన ధరలు నేడు మళ్లీ ఎగబాకాయి. మేలిమి బంగారం ధర రూ.1040 మేర పెరిగింది. అంతర్జాతీయ అనిశ్చితులు, డాలర్ బలపడటం వంటి కారణాలతో ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,040 మేర పెరిగి రూ.1,50,280కు చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.950 మేర ఎగబాకి రూ.1,37,750కు పెరిగింది. వెండి ధర మాత్రం ఈ వారం దాదాపు స్థిరంగానే కొనసాగుతోంది. నగరంలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.4 లక్షలుగా ఉంది.


తెలంగాణలోని పట్టణాలు, నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,50,280

₹1,37,750

₹1,12,710

నిజామాబాద్

₹1,50,280

₹1,37,750

₹1,12,710

ఖమ్మం

₹1,50,280

₹1,37,750

₹1,12,710


ఏపీలోని పట్టణాలు, నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,50,280

₹1,37,750

₹1,12,710

విశాఖపట్నం

₹1,50,280

₹1,37,750

₹1,12,710

అమరావతి

₹1,50,280

₹1,37,750

₹1,12,710

కాకినాడ

₹1,50,280

₹1,37,750

₹1,12,710

తిరుపతి

₹1,50,280

₹1,37,750

₹1,12,710


భారత్‌లోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పుత్తడి ధరలు ఇలా

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,50,280

₹1,37,750

₹1,13,170

ముంబై

₹1,50,280

₹1,37,750

₹1,12,710

ఢిల్లీ

₹1,50,450

₹1,37,900

₹1,12,860

కోల్‌కతా

₹1,50,280

₹1,37,750

₹1,12,710

బెంగళూరు

₹1,50,280

₹1,37,750

₹1,12,710

కేరళ

₹1,50,280

₹1,37,750

₹1,12,710

పుణె

₹1,50,280

₹1,37,750

₹1,12,710

వడోదరా

₹1,50,350

₹1,37,800

₹1,12,760


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలనూ చదవండి:

జీఎస్‌టీ వసూళ్ల జోరు

సెప్టెంబరులో ‘ఆటో’ జోష్‌

Updated Date - Oct 02 , 2026 | 10:53 AM