జీఎస్‌టీ వసూళ్ల జోరు
ABN , Publish Date - Oct 02 , 2026 | 06:02 AM
సెప్టెంబరు నెలలో స్థూల జీఎస్‌టీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 14.7ు పెరిగి రూ.2.03 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దేశీయంగా వినియోగం మరింత పుంజుకోవడంతో పాటు దిగుమతులపై పన్ను రాబడిలో బలమైన..
సెప్టెంబరులో రూ.2.03 లక్షల కోట్లు.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది మూడోసారి
న్యూఢిల్లీ: సెప్టెంబరు నెలలో స్థూల జీఎస్‌టీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 14.7ు పెరిగి రూ.2.03 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దేశీయంగా వినియోగం మరింత పుంజుకోవడంతో పాటు దిగుమతులపై పన్ను రాబడిలో బలమైన వృద్ధి ఇందుకు ప్రధానంగా దోహదపడ్డాయి. కేంద్ర ఆర్థిక శాఖ గురువారం విడుదల చేసిన డేటా ప్రకారం.. సెప్టెంబరులో దేశీయంగా ఆర్థిక కార్యకలాపాల నుంచి స్థూల జీఎస్‌టీ వసూళ్లు 10.1ు పెరుగుదలతో రూ.1.38 లక్షల కోట్లకు చేరాయి. దిగుమతులపై జీఎస్‌టీ ఆదాయం 26ు వృద్ధి చెంది రూ.65,525 కోట్లుగా నమోదైంది. అంతర్జాతీయ ప్రతికూలతల్లోనూ దేశీయంగా వినియోగం చురుకుగా సాగుతుందనడానికిది సంకేతమని ఈవై ఇండియా ట్యాక్స్ పార్ట్‌నర్ సౌరభ్ అగర్వాల్ అన్నారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌టీ ఆదాయం రూ.2 లక్షల కోట్ల మైలురాయిని దాడటం ఇది మూడోసారి. ఈ ఏప్రిల్‌లో ఆల్‌టైం రికార్డు గరిష్ఠ స్థాయి రూ.2.43 లక్షల కోట్లు, జూలైలో రూ.2.11 లక్షల కోట్లుగా నమోదైంది.
నికర జీఎస్‌టీ ఆదాయం రూ.1.76 లక్షల కోట్లు
గత నెలలో జీఎ్‌సటీ రిఫండ్లు వార్షిక ప్రాతిపదికన 3ు తగ్గి రూ.27,001 కోట్లకు పరిమితమయ్యాయి. రిఫండ్లు మినహాయించగా నికర జీఎ్‌సటీ ఆదాయం రూ.1.76 లక్షల కోట్లు నమోదైంది. 2025 సెప్టెంబరులో నమోదైన రూ.1.49 లక్షల కోట్లతో పోలిస్తే 18.1ు అధికం.
ప్రఽథమార్ధం వసూళ్లు రూ.12.46 లక్షల కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో సెప్టెంబరుతో ముగిసిన ప్రథమార్ధానికి స్థూల జీఎస్‌టీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 11.6 శాతం వృద్ధితో రూ.12.46 లక్షల కోట్లకు చేరాయి. నికర వసూళ్లు 10.4 శాతం పెరుగుదలతో రూ.10.66 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
తెలంగాణ జీఎస్‌టీ ఆదాయంలో 18% వృద్ధి
సెప్టెంబరులో తెలంగాణ జీఎస్‌టీ ఆదాయం రూ.5,327 కోట్లకు పెరిగింది. 2025 సెప్టెంబరు రాబడి రూ.4,512 కోట్లతో పోలిస్తే 18ు వృద్ధి నమోదైంది.
ఈ వార్తలు కూడా చదవండి
జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ దూకుడు.. సెప్టెంబర్‌లో రూ.5,327 కోట్లు
రూ. 9లక్షల కోట్లు ఆవిరి.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..