Share News

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ దూకుడు.. సెప్టెంబర్‌లో రూ.5,327 కోట్లు

ABN , Publish Date - Oct 01 , 2026 | 01:52 PM

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తోంది. సెప్టెంబర్ నెలలో 18 శాతం వృద్ధితో రూ.5,327 కోట్ల డొమెస్టిక్ జీఎస్టీ రెవెన్యూ నమోదు అయ్యింది.

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ దూకుడు.. సెప్టెంబర్‌లో రూ.5,327 కోట్లు
Telangana GST

ఢిల్లీ, అక్టోబర్ 1: దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో సానుకూలమైన వృద్ధి నమోదైంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా గణనీయమైన అభివృద్ధి కనిపించింది. జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తోంది. సెప్టెంబర్ నెలలో 18 శాతం వృద్ధితో రూ.5,327 కోట్ల డొమెస్టిక్ జీఎస్టీ రెవెన్యూ నమోదు అయ్యింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభం (ఏప్రిల్) నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రానికి అందిన పోస్ట్-సెటిల్‌మెంట్ SGST మొత్తం రూ.22,231 కోట్లుగా ఉంది. మొత్తం 18 శాతం వృద్ధి నమోదైంది. జాతీయ సగటు వృద్ధి రేటును తెలంగాణ పన్నుల సేకరణ వెనక్కినెట్టింది.


ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ జీఎస్టీ వసూళ్లు స్థిరమైన వృద్ధిని నమోదు చేశాయి. సెప్టెంబర్‌ నెలలో రూ.3,599 కోట్ల డొమెస్టిక్ జీఎస్టీ రెవెన్యూ నమోదు అయ్యింది. ఇది 6 శాతం వృద్ధిగా నమోదైంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 మధ్య కాలంలో ఏపీకి సమకూరిన మొత్తం పోస్ట్-సెటిల్‌మెంట్ SGST రెవెన్యూ రూ. 19,598 కోట్లుగా నమోదైంది.18 శాతం వృద్ధి నమోదైంది. సెటిల్‌మెంట్‌ల ప్రక్రియతో పాటు పన్నుల రూపంలో రాష్ట్రాలకు వస్తున్న ఆదాయం ఆశాజనకంగా ఉందని తాజా జీఎస్టీ నివేదిక వెల్లడించింది.


ఇవి కూడా చదవండి...

అరకు కాఫీని గౌరవించుకోవడం గర్వకారణం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

లింగంపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 01:56 PM