లింగంపల్లి రైల్వేస్టేషన్ వద్ద భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్
ABN , Publish Date - Oct 01 , 2026 | 10:31 AM
హైదరాబాద్‌లో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. లింగంపల్లి రైల్వేస్టేషన్ వద్ద దాదాపు 23 కిలోల గంజాయిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 1: నగరంలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. లింగంపల్లి రైల్వేస్టేషన్ వద్ద దాదాపు 23 కిలోల గంజాయిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో లింగంపల్లి రైల్వేస్టేషన్ వద్ద డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానితులగా కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారు పట్టుబడిన వారు ముంబైకి చెందిన రహ్మతుల్లా ఖాన్, రషీద్‌గా గుర్తించారు.
నిందితులు ఒరిస్సాలో గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌కు అక్రమంగా చేరవేస్తున్నట్లు విచారణలో బయటపడింది. ఇద్దరిని అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. వారిని ముందస్తు విచారణ నిమిత్తం శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు. ఒరిస్సాలో గంజాయిని ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేశారు.. హైదరాబాద్‌లో ఎవరెవరికి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు అనేదానిపై ఎక్సైజ్ పోలీసులు ఆరా తీయనున్నారు.
ఇవి కూడా చదవండి...
నేడు బాపట్లలో సీఎం పర్యటన.. చంద్రబాబు చేతుల మీదుగా కొత్త పింఛన్ల పంపిణీ
అరకు కాఫీని గౌరవించుకోవడం గర్వకారణం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Read Latest Telangana News And Telugu News