పల్నాడు జిల్లాలో భారీ చోరీ.. ఇంట్లోకి చొరబడి 40 సవర్ల బంగారం చోరీ
ABN , Publish Date - Oct 01 , 2026 | 07:51 AM
పల్నాడు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లోకి చొరబడి రూ. 50 లక్షల విలువైన బంగారాన్ని దోచుకెళ్లారు. బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.
పల్నాడు జిల్లా, అక్టోబర్ 1: జిల్లాలోని సత్తెనపల్లి మండలంలోని ధూళిపాళ్ళలో భారీ చోరీ చోటుచేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు రూ.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదును చోరీ చేశారు.
బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. విశ్వేశ్వర్ రావు అనే వ్యక్తి సత్తెనపల్లి మండలంలోని ధూళ్లిపాళ్ళలో కుటుంబంతో నివసిస్తుంటారు. అవసరం నిమిత్తం కుటుంబసభ్యులతో కలిసి విశ్వేశ్వర్ రావు పొరుగూరికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించిన దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాను పగులగొట్టి రూ. 50 లక్షల విలువైన 40 సవర్ల బంగారాన్ని దోచుకున్నారు. దానితోపాటు రూ.6 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. తిరిగి వచ్చిన బాధితులు దొంగలు పడ్డారని గ్రహించి సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎస్‌ఏ పరీక్షల మూల్యాంకనం వేరే పాఠశాలల్లో..
Read Latest AP News And Telangana News