Share News

నేడు బాపట్లలో సీఎం పర్యటన.. చంద్రబాబు చేతుల మీదుగా కొత్త పింఛన్ల పంపిణీ

ABN , Publish Date - Oct 01 , 2026 | 07:09 AM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు(గురువారం) బాపట్లలో నిర్వహించనున్న పేదలసేవ కార్యక్రమంలో పాల్గొని నూతన పింఛన్లు అందజేయనున్నారు.

నేడు బాపట్లలో సీఎం పర్యటన.. చంద్రబాబు చేతుల మీదుగా కొత్త పింఛన్ల పంపిణీ
cm chandrababu visits bapatla

బాపట్ల, అక్టోబర్ 1: రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా నూతన పింఛన్లను ఈ రోజు నుంచే పంపిణీ చేయనున్నారు. బాపట్ల జిల్లాలోని రేపల్లెలో ఏర్పాటు చేసిన పేదల సేవ కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త పింఛన్లను అర్హులకు అందజేస్తారు. ఈ మేరకు సీఎం నేడు బాపట్లలో పర్యటించనున్నారు.


సీఎం ఈ రోజు ఉదయం 10.45 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 11.00 గంటలకు రేపల్లెకు చేరుకోనున్నారు. 11.25 గంటలకు రేపల్లె పట్టణంలోని 4వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 03.25 గంటలకు రేపల్లె నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. సమావేశ అనంతరం సాయంత్రం 05.20 గంటలకు ఉండవల్లి క్యాంప్ కార్యాలయానికి వెల్లనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:


క్యాబినెట్‌ భేటీ లిస్టు నుంచి హ డ్కో రుణ ఫైలు రద్దు

నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

Read Latest AP News And Telangana News

Updated Date - Oct 01 , 2026 | 08:15 AM