Share News

క్యాబినెట్‌ భేటీ లిస్టు నుంచి హ డ్కో రుణ ఫైలు రద్దు

ABN , Publish Date - Oct 01 , 2026 | 05:55 AM

హ్యామ్‌ రోడ్ల నిర్మాణం కోసం హడ్కో నుంచి రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఆర్‌డీసీ) తీసుకున్న రుణంపై వడ్డీ విషయంలో ప్రతిష్టంభన ఏర్పడటంతో నేటి క్యాబినెట్‌ భేటీ కోసం సిద్ధం చేసిన ఈ రుణ ఫైలు అర్థంతరంగా నిలిచిపోయింది.

క్యాబినెట్‌ భేటీ లిస్టు నుంచి హ డ్కో రుణ ఫైలు రద్దు
HUDCO

  • హ్యామ్‌ కోసం 9,161 కోట్ల రుణం తీసుకోవాలని ప్రతిపాదన

  • వడ్డీరేటుపై ఆర్థిక శాఖ అభ్యంతరాలతో ప్రతిష్టంభన

హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): హ్యామ్‌ రోడ్ల నిర్మాణం కోసం హడ్కో నుంచి రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఆర్‌డీసీ) తీసుకున్న రుణంపై వడ్డీ విషయంలో ప్రతిష్టంభన ఏర్పడటంతో నేటి క్యాబినెట్‌ భేటీ కోసం సిద్ధం చేసిన ఈ రుణ ఫైలు అర్థంతరంగా నిలిచిపోయింది. రోడ్లు భవనాల (ఆర్‌ అండ్‌ బీ) శాఖ పరిధిలో హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌ (హ్యామ్‌) విధానంలో చేపట్టిన రోడ్ల పనుల్లో కాంట్రాక్టర్లకు ప్రభుత్వం మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ కింద చెల్లించేందుకు హడ్కో నుంచి రూ.9,161 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.


ఈ రుణంలో ఐదేళ్ల్లలో తిరిగి చెల్లించే మొత్తానికి 8.6 శాతం, 15 ఏళ్లలో తిరిగి చెల్లించే రుణానికి 9.12శాతం వడ్డీరేటును హడ్కో నిర్ణయించింది. హడ్కో, ఆర్‌డీసీ మధ్య కుదిరిన రుణ ఒప్పందానికి క్యాబినెట్‌ ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే, వడ్డీ విషయంలో ఆర్థికశాఖ అభ్యంతరం తెలిపింది. మొత్తం రుణానికి 8.6శాతం చొప్పునే వడ్డీ ఉండాలని స్పష్టంచేసింది. దీంతో గురువారం జరిగే క్యాబినెట్‌ సమావేశానికి ఈ ఫైలు వెళ్లడం లేదని తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి:
మెట్రోలో ఎల్‌అండ్‌టీ వాటా విక్రయ గడువు పెంపు

నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 05:55 AM