Share News

మెట్రోలో ఎల్‌అండ్‌టీ వాటా విక్రయ గడువు పెంపు

ABN , Publish Date - Oct 01 , 2026 | 05:50 AM

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎల్‌అండ్‌ టీ మెట్రో రైల్‌ (హైదరాబాద్‌) లిమిటెడ్‌లోని తన మొత్తం వాటాని హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌కు విక్రయించే ప్రక్రియ పూర్తి చేసేందుకు ఉన్న గడువును ఎల్‌ అండ్‌ టీ సంస్థ మరోసారి పొడిగించింది.

మెట్రోలో ఎల్‌అండ్‌టీ వాటా విక్రయ గడువు పెంపు
Hyderabad Metro

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎల్‌అండ్‌ టీ మెట్రో రైల్‌ (హైదరాబాద్‌) లిమిటెడ్‌లోని తన మొత్తం వాటాని హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌కు విక్రయించే ప్రక్రియ పూర్తి చేసేందుకు ఉన్న గడువును ఎల్‌ అండ్‌ టీ సంస్థ మరోసారి పొడిగించింది. ఈ లావాదేవీని పూర్తి చేయడానికి 2026 సెప్టెంబరు 30 వరకు ఉన్న గడువును ఎల్‌ అండ్‌ టీ సంస్థ 2026 డిసెంబరు 31 వరకు పొడిగించింది.


స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌ అయిన బీఎస్‌ఈకి బుధవారం సమర్పించిన నివేదికలో ఎల్‌ అండ్‌ టీ ఈ విషయం పేర్కొంది. ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ (హైదరాబాద్‌) లిమిటెడ్‌లో తన మొత్తం వాటాను రూ. 1,461.47 కోట్లకు విక్రయించేందుకు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌తో ఎల్‌అండ్‌టీ ఒప్పందం కుదుర్చుకుంది. తొలుత ఈ ప్రక్రియను జూన్‌ 30 నాటికి పూర్తి చేయాలని భావించిన సంస్థ.. అనంతరం గడువును సెప్టెంబరు 30కి మార్చింది. ఇప్పుడు ఆ గడువును డిసెంబరు 31 వరకు పొడిగించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలి

నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 05:50 AM