Share News

నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ABN , Publish Date - Oct 01 , 2026 | 05:38 AM

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం ప్రారంభం కానుంది.

నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
Telangana Secretariat

  • సిరిసిల్లలోని ఆరు వేల ఇళ్లకు హక్కులు..!

హైదరాబాద్‌, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం ప్రారంభం కానుంది. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు తగిన సమాచారంతో అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు ఆదేశించారు. సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యాల(డీఏ)పై చర్చ జరగనుంది. దసరా నుంచి రెండు డీఏలను అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో డీఏలకు క్యాబినెట్‌ ఆమోదం తెలపనుంది.


ధరణి, 22-ఏ, ఇతర రెవెన్యూ శాఖ అంశాలు, సాగునీటి పారుదలపై చర్చించే అవకాశాలున్నాయి. క్యాబినెట్‌ సమావేశంలో సిరిసిల్లలోని సుందరయ్య నగర్‌, బద్దం ఎల్లారెడ్డి నగర్‌, రాజీవ్‌ నగర్‌, పద్మానగర్‌లలో ఉన్న ఆరు వేల ఇళ్లకు హక్కులు కల్పించే అంశంపై చర్చించే అవకాశం ఉంది. కాలనీలు ఏర్పాటై 30-40 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు అక్కడుంటున్న వారి ఇళ్లకు సంబంధించి క్రయ విక్రయాలు, వారసత్వ బదిలీ చేసుకునేందుకు అవకాశం లేదు. ఈ మేరకు అక్కడుంటున్న వారి ఇళ్లపై వారికే పూర్తి హక్కులు కల్పించేలా క్యాబినెట్‌లో ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలిసింది. మరోవైపు ఈషా ఫౌండేషన్‌కు కొంత భూమిని కేటాయించేందుకు అవకాశం ఉందని, సంబంధిత ఫైలు క్యాబినెట్‌ అజెండాలో ఉందని సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి:

ప్రపంచ టాప్‌ వెయ్యి వర్సిటీల్లో హెచ్‌సీయూ

తెలంగాణలో వచ్చేది మా ప్రభుత్వమే

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 05:38 AM