తెలంగాణలో వచ్చేది మా ప్రభుత్వమే
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:27 AM
తెలంగాణలో వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదు
ఇండియా టుడే సదస్సులో కేటీఆర్ స్పష్టీకరణ
హైదరాబాద్, కొచ్చి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొచ్చిలో నిర్వహించిన ఇండియా టుడే సదస్సులో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం రీకాల్, రిగ్రేట్, రీవోల్ట్(ఆర్‌ఆర్‌ఆర్) పరిస్థితి కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్‌కు ఓటేసినందుకు ప్రజలు పునరాలోచిస్తున్నారని చెప్పారు. బీజేపీతో బీఆర్‌ఎ్‌సకు ఎలాంటి పొత్తు ఉండదని, 26 ఏళ్లలో బీజేపీతో ఒక్కసారీ పొత్తుపెట్టుకోలేదని గుర్తు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సంతకాలు లేకున్నా జీఎస్టీ నోటీసులు సబబే
రేవంత్.. సిరిసిల్ల అభివృద్ధిని చూసి నేర్చుకో
Read Latest AP News And Telangana News And International News And Telugu News