Share News

రేవంత్‌.. సిరిసిల్ల అభివృద్ధిని చూసి నేర్చుకో

ABN , Publish Date - Oct 01 , 2026 | 05:18 AM

సిరిసిల్ల అభివృద్ధిపై బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ హయాంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు.

రేవంత్‌.. సిరిసిల్ల అభివృద్ధిని చూసి నేర్చుకో
Harish Rao

  • కేటీఆర్‌ ఎంతో అభివృద్ధి చేశారు: హరీశ్‌రావు

హైదరాబాద్‌సిటీ/రాంగోపాల్‌పేట/హైదరాబాద్‌,సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘‘పోలీసులు, కాంగ్రెస్‌ గుండాలు, కార్యకర్తలను తీసుకొని సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్లపై దండయాత్రకు వెళ్తున్నాడట. దండయాత్ర చేయడానికి సిరిసిల్ల ఏమైనా శత్రురాజ్యమా..? తెలంగాణలో లేదా..? కేటీఆర్‌కు ముందు.. తరువాత ఎలా అభివృద్ధి జరిగిందో సిరిసిల్ల ప్రజలను అడగండి. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అద్భుతంగా, ఆదర్శ నియోజకవర్గంగా సిరిసిల్లను కేటీఆర్‌ తీర్చిదిద్దారు. సిరిసిల్లకు వెళ్లి అభివృద్ధి, సంక్షేమం ఎలా చేయాలో రేవంత్‌ నేర్చుకొని రావాలి’’ అని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు అన్నారు.


బుధవారం సికింద్రాబాద్‌ ఎస్పీ రోడ్డులోని జోరాస్ట్రియన్‌ క్లబ్‌లో జరిగిన సనత్‌నగర్‌ నియోజకవర్గంలో పట్టభద్రుల ఓటరు నమోదు సన్నాహక సమావేశంలో హరీశ్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మెదటి ఏడాదే రెండు లక్షల ఉద్యాగాలు ఇస్తామని నిరుద్యోగులను నమ్మించి వంచించారని ఆరోపించారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ నియోజకవర్గాలు, ఖైరతాబాద్‌ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం తధ్యమని అన్నారు. కాగా, మంచిర్యాల జిల్లా(జైపూర్‌) సింగరేణి విద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తయ్యే కరెంటును రాజస్థాన్‌కు కట్టబెట్టడం తగదని, ఆ ఒప్పందాన్ని రద్దుచేసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

క్షుద్ర పూజలంటూ అపవాదు వేశారు

బీఎల్‌వోలు ఓటర్ల ఇంటికే వెళ్లండి..!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 05:18 AM