క్షుద్ర పూజలంటూ అపవాదు వేశారు
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:13 AM
దైవ దర్శనానికి పుణ్యక్షేత్రాలకు వెళ్తే.. రాష్ట్రంలో వర్షాలు పడకూడదంటూ తాను క్షుద్ర పూజలు చేశానని, తనపై ఘోరమైన అపవాదు వేసి, పరువుకు భంగం కలిగించారని.. బుధవారం బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.
నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో హరీశ్‌రావు వాంగ్మూలం
8వ తేదీకి వాయిదా పడిన పరువు నష్టం కేసు
నోటీసులు తిరస్కరించిన టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
రాజకీయ వ్యాఖ్యలని సమర్థించుకున్న ఎమ్మెల్సీ అద్దంకి
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): దైవ దర్శనానికి పుణ్యక్షేత్రాలకు వెళ్తే.. రాష్ట్రంలో వర్షాలు పడకూడదంటూ తాను క్షుద్ర పూజలు చేశానని, తనపై ఘోరమైన అపవాదు వేసి, పరువుకు భంగం కలిగించారని.. బుధవారం బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు తనపై నిరాధారమైన వ్యాఖ్యలు చేశారని వాపోయారు. గాంధీభవన్‌లో మీడియా ముందు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఈమేరకు తనపై అపవాదు వేశారని పేర్కొన్నారు.
వీటికి సంబంధించిన వీడియోలు, వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను కోర్టుకు సమర్పించానని, తనపై అపవాదు వేసిన వారితో బహిరంగ క్షమాపణలు చెప్పించడంతో పాటు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. హరీశ్‌రావు స్టేట్‌మెంట్‌ను నమోదు చేసిన కోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 8వ తేదీకి వాయిదా వేసిందని ఆయన న్యాయవాదులు జి.కిరణ్, జి.లక్ష్మణ్ తెలిపారు. ఇక ఈ కేసులో ఇప్పటికే హరీశ్‌రావు పంపిన నోటీసులను మహే్‌షగౌడ్ తిరస్కరించగా... దయాకర్ బదులిచ్చారు. అందులో తన తప్పు ఒప్పుకోకుండా.. హరీశ్‌రావు క్షుద్రపూజలు చేశారని ఉటంకించారని, చివర్లో మాత్రం ఇవి రాజకీయ వ్యాఖ్యలని సమర్థించుకున్నట్టు హరీశ్‌రావు న్యాయవాదులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
శంషాబాద్ విమానాశ్రయంలో రూ.24.5 కోట్ల కొకైన్ పట్టివేత
బీఎల్‌వోలు ఓటర్ల ఇంటికే వెళ్లండి..!
Read Latest AP News And Telangana News And International News And Telugu News