Share News

శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.24.5 కోట్ల కొకైన్‌ పట్టివేత

ABN , Publish Date - Oct 01 , 2026 | 04:56 AM

శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు 4.9 కిలోల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.24.5 కోట్ల కొకైన్‌ పట్టివేత
Hyderabad airport cocaine seizure

  • దోహ నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజీలో గుర్తింపు

హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు 4.9 కిలోల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.24.5 కోట్లు ఉంటుందని డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. దోహ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడు కొకైన్‌ తెస్తున్నట్లు సమాచారమందడంతో డీఆర్‌ఐ అధికారులు భారీగా తనిఖీలు చేపట్టారు.


అనుమానాస్పద వ్యక్తి క్యాబిన్‌ లగేజ్‌ బ్యాగులో 7 లిండ్ట్‌ లిండోర్‌ చాక్లెట్‌ ట్యూబులను గుర్తించారు. ఒక్కో ట్యూబ్‌ బరువు 387 గ్రాముల బరువు ఉండడంతో వాటిని తెరిచి తనిఖీ చేశారు. ఒక్కో ట్యూబ్‌లో లేత పసుపురంగు క్యాప్సూల్స్‌ ఉండటాన్ని గుర్తించారు. వాటిని తెరిచి పరిశీలించగా అందులో కొకైన్‌ నింపి ఉండటంతో మొత్తం 207 క్యాప్సూల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడ్ని ఎన్‌డీపీఎస్ చట్టం కింద అరెస్టు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ముగ్గురు కొడుకులున్నా.. మెతుకు కరువై.. వృద్ధ జంట ఆత్మహత్య

హరిణి హత్య కేసులో అదుపులో నిందితుడు!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 04:56 AM