Share News

బీఎల్‌వోలు ఓటర్ల ఇంటికే వెళ్లండి..!

ABN , Publish Date - Oct 01 , 2026 | 05:05 AM

సర్‌ ప్రక్రియ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలని.. గడువులోగా జాబితా తయారుచేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు.

బీఎల్‌వోలు ఓటర్ల ఇంటికే వెళ్లండి..!
Telangana electoral roll revision

  • అక్కడి నుంచే డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయండి

  • గడువులోగా జాబితా తయారు చేయాలి: సీఈవో

కేపీహెచ్‌బీకాలనీ/నిజాంపేట, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): సర్‌ ప్రక్రియ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలని.. గడువులోగా జాబితా తయారుచేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. నోటీసులు అందుకున్న ఓటర్ల ఇంటికే వెళ్లి సంబంధిత డాక్యుమెంట్లను బీఎల్‌వోలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని.. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన బాధ్యత మాత్రం సూపర్‌ వైజర్లదేనని చెప్పారు. బుధవారం కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కైతలాపూర్‌ వార్డు ప్రగతినగర్‌లో జిల్లా కలెక్టర్‌ మనూ చౌదరితో కలిసి ఆయన పర్యటించారు. సర్‌ ప్రక్రియ పకడ్బందీగా, పారదర్శకంగా జరిగేలా ఈఆర్వో, ఏఈఆర్వోలు చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలు దరఖాస్తులు అప్‌లోడ్‌ చేస్తున్న తీరును సీఈవో పరిశీలించారు.


ఎక్కువగా ఏయే డాక్యుమెంట్లు ఇస్తున్నారని అడగ్గా.. టెన్త్‌ మెమో, పాస్‌పోర్టు ఇస్తున్నట్లు బీఎల్‌వోలు సమాధానమిచ్చారు. విచారణ, దరఖాస్తుల పరిశీలన, అభ్యంతరాల పరిష్కారం విషయంలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. జోనల్‌ కార్యాలయంలో నియోజకవర్గంలో ఓటర్ల జాబితా, డిలీట్‌, నోటీసులు అందుకున్న ఓటర్ల లిస్ట్‌, అప్‌లోడ్‌ చేసిన సంఖ్యను ఈఆర్వో, ఏఈఆర్వోలను అడిగి ఆయన తెలుసుకున్నారు. ఇంకా లక్షకు పైగా పెండింగ్‌ ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన కేంద్ర ఎన్నికల సంఘం ఇక అవకాశమివ్వదని.. వేగం పెంచాలని సీఈవో ఆదేశించినట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి:

శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.24.5 కోట్ల కొకైన్‌ పట్టివేత

హరిణి హత్య కేసులో అదుపులో నిందితుడు!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 05:05 AM