ప్రపంచ టాప్ వెయ్యి వర్సిటీల్లో హెచ్‌సీయూ
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:33 AM
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ - 2027లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి (హెచ్‌సీయూ) మెరుగైన స్థానం లభించింది.
టైమ్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానం
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ - 2027లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి (హెచ్‌సీయూ) మెరుగైన స్థానం లభించింది. 2026 ర్యాంకింగ్స్‌లో 1,001- 1,200 శ్రేణిలో ఉన్న హెచ్‌సీయూ.. తాజాగా 2027 ఎడిషన్‌లో 801-1,000 శ్రేణిలోకి చేరి ప్రపంచంలోని టాప్ 1,000 విశ్వవిద్యాలయాలలో ఒకటిగా నిలిచింది. ఇప్పటివరకు హెచ్‌సీయూకు ఇదే అత్యుత్తమ ర్యాంకు. గత ఏడాది 115 దేశాల్లోని 2,191 సంస్థలను పరిగణనలోకి తీసుకోగా, 2027 ఎడిషన్‌లో 118 దేశాల్లోని 2,297 యూనివర్సిటీలకు టైమ్స్ ర్యాంకులు ఇచ్చారు.
పరిశోధన-కేంద్రీకృత విశ్వవిద్యాలయాల పనితీరును 17సూచికల ఆధారంగా టైమ్స్ అంచనా వేస్తుంది. ఇందులో పరిశోధన నాణ్యత(30 శాతం), బోధన (29.5 శాతం), పరిశోధన వాతావరణం(29 శాతం), అంతర్జాతీయదృక్పథం(7.5 శాతం) పరిశ్రమల(4 శాతం)కు ప్రాధా న్యం ఉంటుంది. ఈ ర్యాంకింగ్‌పై వర్సిటీ వీసీ అనురాధ సంతోషం వ్యక్తంచేశారు. వేలాది సంస్థలతో పోటీపడి తమ విశ్వవిద్యాలయం 801- 1,000 ప్రపంచ శ్రేణిలోకి ప్రవేశించడం.. అంకితభావానికి నిదర్శనమన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సంతకాలు లేకున్నా జీఎస్టీ నోటీసులు సబబే
తెలంగాణలో వచ్చేది మా ప్రభుత్వమే
Read Latest AP News And Telangana News And International News And Telugu News