ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:45 AM
ఆదివాసీల సమస్యలను అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించినా ప్రభుత్వం ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని బీజేఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు.
లేదంటే సచివాలయం ముందు ధర్నా: పాయల్ శంకర్
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీల సమస్యలను అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించినా ప్రభుత్వం ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని బీజేఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. నెల రోజుల్లోగా వారి సమస్యలను పరిష్కరించకపోతే ఆదివాసీ కుటుంబాలతో కలిసి సచివాలయం ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లాను బుధవారం ఆయన ఆదివాసీ ప్రతినిధులతో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఆదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టిసవర్గాం గ్రామంలో సుమారు 500 ఆదివాసీ కుటుంబాలు 30 ఏళ్లుగా నివసిస్తున్నప్పటికీ వారికి ఇళ్ల పట్టాలు, ఇంటి స్థలాలపై గుర్తిం పు పొందిన హక్కులు లేవని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్యుత్, సురక్షిత తాగునీరు వంటి కనీస సౌకర్యాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రపంచ టాప్ వెయ్యి వర్సిటీల్లో హెచ్‌సీయూ
నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
Read Latest AP News And Telangana News And International News And Telugu News