Share News

హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌లో 10 రైళ్లకు తాత్కాలిక హాల్ట్‌

ABN , Publish Date - Oct 01 , 2026 | 09:38 AM

దీపావళి, క్రిస్మస్‌, సంక్రాంతి పండుగల సీజన్‌లో నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్లకు పెరిగే ప్రయాణికుల రద్దీ నిర్వహణకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌లో 10 రైళ్లకు తాత్కాలిక హాల్ట్‌
Hi Tech City Railway Station

  • నవంబరు 1 నుంచి జనవరి 31 వరకు అమలు

హైదరాబాద్‌ సిటీ: దీపావళి, క్రిస్మస్‌, సంక్రాంతి పండుగల సీజన్‌లో నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్లకు పెరిగే ప్రయాణికుల రద్దీ నిర్వహణకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌లో 10 రైళ్లకు తాత్కాలికంగా హాల్ట్‌ను ప్రకటించింది. ఈ సదుపాయం నవంబరు 1 నుంచి వచ్చే ఏడాది జనవరి 31 వరకు అమల్లో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.


ఆయా తేదీల్లో ఇప్పటికే రిజర్వేషన్‌ టికెట్లు బుక్‌ చేసుకున్న హైటెక్‌ సిటీ సమీపంలో ఉండే ప్రయాణికులు తమ బోర్డింగ్‌ స్టేషన్‌ను ఆన్‌లైన్‌లో లేదా అన్ని రిజిర్వేషన్‌ కౌంటర్లలో ఉచితంగా మార్చుకోవచ్చని పేర్కొన్నారు. 22717/18 సికింద్రాబాద్‌-రాజ్‌కోట్‌-సికింద్రాబాద్‌, 20967/68 సికింద్రాబాద్‌-పోర్‌బందర్‌-సికింద్రాబాద్‌,


city4.2.jpg12731/32 సికింద్రాబాద్‌-తిరుపతి-సికింద్రాబాద్‌, 12701/02 హైదరాబాద్‌-ముంబై-హైదరాబాద్‌, 12025/26 హైదరాబాద్‌-పుణె-హైదరాబాద్‌ రైళ్లకు హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌లో కల్పించిన తాత్కాలిక హాల్ట్‌ సౌకర్యాన్ని సమీప ప్రాంతాల ప్రజలు వినియోగించుకోవాలని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు.. నేటి రేట్స్ ఇవీ

శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 09:38 AM