మకాం మార్చి.. 35 ఏళ్లుగా కళ్లుగప్పి..
ABN , Publish Date - Oct 01 , 2026 | 08:15 AM
హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉండి, 35 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న రౌడీషీటర్‌ను చార్మినార్ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
ఎట్టకేలకు రౌడీషీటర్‌ను అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్ సిటీ: హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉండి, 35 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న రౌడీషీటర్‌ను చార్మినార్ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. చాంద్రాయణగుట్టకు చెందిన ఇల్యాస్ బిన్ హుస్సేన్ యాఫై పలు నేరాల్లో నిందితుడిగా ఉన్నాడు. 1991లో జరిగిన హత్యాయత్నం కేసులో ఇతడిపై చాంద్రయణగుట్ట పోలీసులు రౌడీషీట్ తెరిచారు. అప్పటి నుంచి పోలీసుల కంటపడకుండా తిరుగుతున్నాడు.
జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఇతడు, స్వదేశానికి తిరిగి వచ్చి పోలీసుల నిఘా నుంచి తప్పించుకోవడానికి వివిధ రాష్ట్రాల్లో పెయింటింగ్ పనులు చేస్తూ తలదాచుకున్నాడు. అజ్ఞాతంలో ఉన్న ఇల్యాస్ బిన్ హుస్సేన్ యాఫైను సుదీర్ఘ కాలం తర్వాత నిఘా వర్గాల నుంచి అంది న సమాచారం మేరకు చార్మినార్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది గుర్తించి అరెస్ట్ చేసింది. రౌడీషీటర్‌ను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు.. నేటి రేట్స్ ఇవీ
శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News