తిరుపతి శివార్లలో చెడ్డీ గ్యాంగ్ కలకలం
ABN , Publish Date - Oct 01 , 2026 | 06:44 AM
తిరుచానూరు పంచాయతీ పరిధిలోని కొత్తపాలెంలో అర్ధరాత్రి అనుమానాస్పద వ్యక్తుల కదలికలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. దీంతో చెడ్డీ గ్యాంగ్ సంచారంపై స్థానికుల్లో భయాందోళనలు నెలకొనగా.. పోలీసులు అప్రమత్తమై నగర శివారు ప్రాంతాల్లో రాత్రిపూట గస్తీని ముమ్మరం చేశారు.
తిరుపతి, అక్టోబర్ 1: నగర శివార్లలో చెడ్డీ గ్యాంగ్ సంచారం కలకలం రేపుతోంది. తిరుచానూరు పంచాయతీ పరిధిలోని కొత్తపాలెంలో అర్ధరాత్రి అనుమానాస్పద వ్యక్తుల కదలికలు సీసీటీవీ కెమెరాల్లో నమోదైనట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన పోలీసులు నగర శివారు ప్రాంతాల్లో రాత్రిపూట గస్తీని ముమ్మరం చేశారు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో, రెండు రోజుల క్రితం అనంతపురం జిల్లా ధర్మవరంలో ఇలాంటి కదలికలు వెలుగులోకి రావడం, తాజాగా తిరుచానూరు పరిధిలోనూ అనుమానాస్పద సంచారం కనిపించడంతో తిరుపతి, నెల్లూరు జిల్లాల పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
అర్ధరాత్రి వేళల్లో అపరిచితులు లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు. రాత్రివేళ ఇంటి తలుపులు, కిటికీలను సరిగ్గా లాక్ చేసుకుని నిద్రించాలని, ఇళ్ల ముందు లేదా అనుమానాస్పద ప్రదేశాల్లో వ్యక్తులు కనిపిస్తే డయల్ 112 లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కాలనీలు, పంచాయతీల్లో వీధి దీపాలు పనిచేసేలా చూడటంతో పాటు సీసీటీవీ కెమెరాలను నిరంతరం పనిచేసే స్థితిలో ఉంచుకోవాలని పోలీసులు ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బీఎల్‌వోలు ఓటర్ల ఇంటికే వెళ్లండి..!
Read Latest AP News And Telangana News