పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు.. పండుగ ముందు షాక్
ABN , Publish Date - Oct 01 , 2026 | 07:54 AM
పండుగ సీజన్ ముందు వినియోగదారులకు షాకిచ్చేలా మరోసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి.
ఇంటర్నెట్ డెస్క్: పండుగ సీజన్ ముందు వినియోగదారులకు షాకిచ్చేలా మరోసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. అనేక నగరాల్లో 19 కేజీల సిలిండర్ ధర రూ.62 మేర పెరిగింది. కొత్త రేట్స్ నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో, హోటల్స్, రెస్టారెంట్లు వంటి వాటి నిర్వహణ ఖర్చులు పెరగనున్నాయి. అయితే, గృహవినియోగదారులకు ఉద్దేశించిన డొమెస్టిక్ సిలిండర్ ధరలు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి.
వివిధ నగరాల్లో ధరలు ఇవీ..
ఢిల్లీ కమర్షియల్ సిలిండర్ ధర రూ.62.50 మేర పెరిగి రూ.2747.50కు చేరుకుంది. సెప్టెంబర్‌లో ధర రూ.9.50 మేర పెరిగింది. ఇక ముంబైలో కూడా ధర రూ.63 మేర పెరిగి రూ.2,764కు చేరింది. చెన్నైలో కూడా ధరలు పెరిగాయి. ప్రస్తుతం 19.2 కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,916.50గా ఉంది. ఇక హైదరాబాద్‌లో కూడా కమర్షియల్ సిలిండర్ ధర రూ.69 మేర పెరిగి రూ.3,065కి చేరింది. గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ఎల్‌పీజీ మార్కెట్ ధరలతో పాటు ఫారిన్ ఎక్సేంజ్ రేట్స్ దేశీయంగా ధరలను ప్రభావితం చేస్తాయన్న విషయం తెలిసిందే. క్రితం నెల మార్పుల ఆధారంగా ఆయిల్ కంపెనీలు దేశీయంగా కమర్షియల్ ధరలను మారుస్తుంటాయి. అయితే, సామాన్యులపై భారం పడకుండా డొమిస్టిక్ సిలిండర్ ధరను ప్రభుత్వం నియంత్రిస్తూ ఉంటుంది.
ఈ వార్తలనూ చదవండి:
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు.. నేటి రేట్స్ ఇవీ
ఏప్రిల్ 1 నుంచి కేఫ్-3 నిబంధనలు