Share News

చీపురుపల్లిలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరేందుకు నేతల నిర్ణయం

ABN , Publish Date - Oct 01 , 2026 | 12:25 PM

విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే..

చీపురుపల్లిలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరేందుకు నేతల నిర్ణయం
Cheepurupalli YSRCP

విజయనగరం, అక్టోబర్ 1: వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గమైన చీపురుపల్లిలో ఆ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నియోజకవర్గంలోని చీపురుపల్లి, గరివిడి మేజర్ పంచాయతీలకు చెందిన మాజీ సర్పంచ్‌లు, పలువురు వార్డు మెంబర్లు, ఆర్‌ఈసీఎస్ మాజీ డైరెక్టర్లు, వందలాది మంది కార్యకర్తలు వైసీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. బొత్స సొంత నియోజకవర్గంలోనే కీలక నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీని వీడటం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.


తాజా రాజీనామాలతో చీపురుపల్లిలో వైసీపీ స్థానిక కేడర్‌పై ప్రభావం పడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. రాజీనామా చేసిన నేతలు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో కలిసి టీడీపీలో చేరనున్నట్లు స్పష్టం చేసినట్లు సమాచారం. గతంలోనూ చీపురుపల్లి పరిధిలో పలువురు వైసీపీ నేతలు రాజీనామా చేసి మజ్జి శ్రీనివాసరావు వెంట నడుస్తామని ప్రకటించారు. దీంతో బొత్సకు సొంత నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకోవడం కీలకంగా మారిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.


ఇవి కూడా చదవండి...

నేడు బాపట్లలో సీఎం పర్యటన.. చంద్రబాబు చేతుల మీదుగా కొత్త పింఛన్ల పంపిణీ

అరకు కాఫీని గౌరవించుకోవడం గర్వకారణం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 12:58 PM