లక్షల విలువ చేసే భూములు పేదల సొంతం అయ్యాయి: ఎమ్మెల్యే రామ్మోహన్
ABN , Publish Date - Oct 01 , 2026 | 01:00 PM
ప్రభుత్వం పేదవారిని లక్షాధికారులుగా మార్చిందని(ఈస్ట్) విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఈ మేరకు ఆయన సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
విజయవాడ, అక్టోబర్ 1: తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అర్హులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎప్పుడు చేపట్టినా.. విజయవాడ నియోజకవర్గానికే ఎక్కువ కేటాయింపులు ఉంటాయన్నారు. నాడు ఎన్టీఆర్ ప్రభుత్వం విజయవాడకు 10,000 పట్టాలను మంజూరు చేసిందని.. ఆ తర్వాత చంద్రబాబు గజం రూపాయి, రూపాయిన్నర నామినల్ రేటుతో భూములను విక్రయించి పేదలకు సొంతభూములు ఉండేలా చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఈ రోజున మళ్లీ నారా చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వం విజయవాడకు 26,000 పట్టాలను మంజూరు చేసిందన్నారు.
‘ఈ రోజు రెల్లి కాలనీగా చెప్పుకుంటున్న ప్రాంతాన్ని నాడు నల్ల చెరువు అనే వారు. 2014-19 లోనే ఈ భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రణాళిక వేసుకున్నాం. కానీ అంతలోనే ఎలక్షన్ కోడ్ వచ్చింది. తరువాత వచ్చిన ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు. మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో ఇన్నాళ్లకు ఈ భూములకు మోక్షం లభించింది. ఇప్పుడు ఈ భూములు కోటిన్నర, లక్షన్నర, లక్షా 75వేలు, 2 లక్షలు విలువ చేసేవిగా మారాయి. ఈ భూముల పట్టాల మంజూరు ద్వారా ప్రభుత్వం పేదలను లక్షాధికారులను చేసిందని ఎమ్మెల్యే రామ్మోహన్ పేర్కొన్నారు.
ప్రభుత్వానికి అండగా నిలవాలి: ఎమ్మెల్యే ఆనందబాబు
బాపట్ల ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు జిల్లాలోని వేమూరు మండలం జంపనిలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు కొత్త పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెన్షన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు పెన్షన్ పెంచింది టీడీపీ ప్రభుత్వమే అని గుర్తుచేశారు. ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తోందని.. స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆనందబాబు ప్రజలను కోరుకున్నారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది: ఎమ్మెల్యే ప్రవీణ్
పల్నాడు జిల్లాలోని పెదకూరపాడులో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అర్హులకు పెన్షన్లను పంపిణీ చేశారు. దానితోపాటు పెదకూరపాడు నియోజకవర్గంలో వీబీ జీరామ్ జీ పథకం కింద10 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో గ్రామాలు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ప్రవీణ్ అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు.. పండుగ ముందు షాక్
ఏప్రిల్ 1 నుంచి కేఫ్-3 నిబంధనలు