సెప్టెంబరులో ‘ఆటో’ జోష్
ABN , Publish Date - Oct 02 , 2026 | 05:56 AM
గడచిన సెప్టెంబరు నెలలో ఆటోమొబైల్ కంపెనీల అమ్మకాల్లో జోరు కొనసాగింది. దేశీయ మార్కెట్లో ప్రయాణికుల వాహనాల (పీవీ) అమ్మకాలు 21 శాతం వృద్ధి చెంది 4.60 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి...
న్యూఢిల్లీ: గడచిన సెప్టెంబరు నెలలో ఆటోమొబైల్ కంపెనీల అమ్మకాల్లో జోరు కొనసాగింది. దేశీయ మార్కెట్లో ప్రయాణికుల వాహనాల (పీవీ) అమ్మకాలు 21 శాతం వృద్ధి చెంది 4.60 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. అన్ని ప్రధాన కార్ల కంపెనీల అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. గత ఏడాది ఇదే నెలలో విక్రయాలు 3.78 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. అక్టోబరులో పండగల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కార్ల కంపెనీలు డీలర్లకు సరఫరాలను పెంచాయి. సెప్టెంబరులో దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ అమ్మకాలు 37 శాతం పెరిగి 1,81,838 యూనిట్లకు చేరాయి. టాటా మోటార్స్ పీవీ అమ్మకాలు 15 శాతం పెరిగి 68,810 యూనిట్లకు చేరాయి. 64,092 యూనిట్ల అమ్మకాలతో ఎం అండ్ ఎం 14 శాతం వృద్ధిని నమోదు చేసింది. హ్యుండయ్ దేశీయ అమ్మకాలు 10.9 శాతం పెరిగి 57,166 యూనిట్లకు చేరాయి. కాగా నవరాత్రుల నుంచి దీపావళి వరకు వాహనాలకు బాగా డిమాండ్ ఉంటుందని పరిశ్రమ భావిస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి
జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ దూకుడు.. సెప్టెంబర్‌లో రూ.5,327 కోట్లు
రూ. 9లక్షల కోట్లు ఆవిరి.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..