Share News

అమల్లోకి క్యూర్‌ యాక్ట్‌?

ABN , Publish Date - Oct 02 , 2026 | 09:56 AM

కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) బిల్లు-2026 నేటి నుంచి అమలులోకి రానుంది. గాంధీ జయంతి సందర్భంగా నేడు ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.

అమల్లోకి క్యూర్‌ యాక్ట్‌?
CURE Act

  • నేడు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం

  • ట్రై కార్పొరేషన్లు, హైడ్రాకు చట్టబద్ధత

హైదరాబాద్‌ సిటీ: కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) బిల్లు-2026 నేటి నుంచి అమలులోకి రానుంది. గాంధీ జయంతి సందర్భంగా నేడు ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. దీంతో పునర్వవస్థీకరణలో భాగంగా కొత్తగా ఏర్పడిన జీహెచ్‌ఎంసీ, మల్కాజ్‌గిరి మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఎంఎంసీ), సైబరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ)లతోపాటు హైడ్రాకు చట్టబద్ధత కలగనుంది. ఆయా సంస్థలు ఇక చట్టబద్ధంగా కార్యకలాపాలు కొనసాగించనున్నాయి.


క్యూర్‌ పరిధిలో నయా పాలన మొదలు కానుంది. 70 ఏళ్ల క్రితం 15 లక్షల జనాభా కలిగిన నగరం కోసం 1955లో హైదరాబాద్‌ మహానగర పురపాలక చట్టం రూపొందించారు. ప్రస్తుతం జనాభా 1.3 కోట్లకు పెరిగింది. భౌగోళికంగా, విస్తీర్ణపరంగా, ఆర్థిక సంక్లిష్టతలో కార్పొరేషన్‌ పరిధి అనేక రెట్లు పెరిగింది. 1955 చట్టంలో కాలం చెల్లిన, అవసరం లేని నిబంధనలు 100కు పైగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో ప్రస్తుత అవసరాలు, పాలనా వ్యవస్థకు అనుగుణంగా క్యూర్‌ పరిధికి సమగ్ర చట్టం అవసరమని భావించి కొత్త యాక్ట్‌ రూపొందించారు.


city5.jpgమూలధన విలువ ఆధారంగా..

నూతన చట్టం నేటి నుంచి అమలులోకి వచ్చినా.. మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్ను మదింపు ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లిస్తున్న భవనాలకు వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) నుంచి మూలధన విలువ ఆధారంగా పన్ను నిర్ధారిస్తారు. పెరిగిన పన్నును ఏటా 10 శాతం చొప్పున వసూలు చేస్తారు. అదే సమయంలో కొత్తగా మదింపు జరిగే ఆస్తులకు మాత్రం మూలధన విలువ ఆధారంగానే మదింపు జరగనుంది.


నేటి నుంచి చట్టం అమలులోకి రానున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి వచ్చే ఆస్తి పన్ను దరఖాస్తులకు నూతన విధానం ప్రకారమే పన్ను నిర్ధారించనున్నట్టు కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. క్యూర్‌ చట్టంతో పేద, మధ్య తరగతి వర్గాలపై అదనపు పన్ను భారం ఉండదని పేర్కొన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి నూతనంగా ఏర్పడిన ఎంఎంసీ, సీఎంసీలతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నిబంధనలు ఎలా ఉంటాయన్న దానిపై స్పష్ట రావాల్సి ఉంది. కొత్త అగ్రిమెంట్‌లో ఇంటింటి చెత్త సేకరణ అప్పగిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి:

అందుకే పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

హ్యాపీ జర్నీ.. ఆర్టీసీ, మెట్రో ఉమ్మడి పాస్‌ నేటి నుంచి అమలులోకి..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 09:56 AM