Share News

ఏఐ మ్యూజిక్ యాప్ సునో నుంచి కొత్త టూల్.. మాటకు మ్యూజిక్ టచ్

ABN , Publish Date - Oct 02 , 2026 | 08:55 AM

ఏఐ మ్యూజిక్ స్టార్టప్ సంస్థ సునో తమ యూజర్లకు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పద్యాలు, ప్రసంగాలకు తగిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ జోడించే సదుపాయాన్ని తీసుకొచ్చింది.

ఏఐ మ్యూజిక్ యాప్ సునో నుంచి కొత్త టూల్.. మాటకు మ్యూజిక్ టచ్
Suno AI

ఇంటర్నెట్ డెస్క్: ఏఐ మ్యూజిక్ స్టార్టప్ సంస్థ సునో తమ యూజర్లకు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పద్యాలు, ప్రసంగాలకు తగిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ జోడించే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఏఐతో పాటలను సృష్టించే సునో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన విషయం తెలిసిందే. దీనికి తోడుగా యూజర్ల మాటకు వినసొంపైనే సంగీతాన్ని జోడించే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘మీరే సొంతంగా ఓ పద్యం రాసుకుని దానికి మరింత అందమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో కొత్త సోబగులు అద్దవచ్చు’ అని సంస్థ సహవ్యవస్థాపకుడు మైకీ షుల్మన్ తెలిపారు. అన్ని రకాల క్రియేటర్ ఎంటర్‌టెయిన్‌మెంట్ పనులకు తామే గమ్యంగా నిలవాలన్న లక్ష్యంతో ఉన్నామని చెప్పారు.


సామాన్యులు, సంగీతంలో ఎలాంటి శిక్షణ లేని వారు కూడా తమ మనసులోని మాటను సునోతో చెప్పి కొత్త పాటను సృష్టించుకోవచ్చు. దీంతో, ఈ ఏఐ టూల్‌‌కు పాప్యులారిటీ పెరుగుతోంది. ఇప్పటికే సునో మార్కెట్ విలువ 5 బిలియన్ డాలర్లను దాటింది. అయితే, ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే కాపీరైట్ కంటెంట్‌తో తమ ఏఐకి సునో శిక్షణ ఇచ్చి అభివృద్ధి చేసుకుందని ఇప్పటికే పలు సంస్థలు న్యాయవివాదానికి తెరతీశాయి. వార్నర్ మ్యూజిక్, యూనివర్సల్ గ్రూప్ ఎన్‌వీ, సోనీ మ్యూజిక్ ఎంటర్‌‌టైన్‌మెంట్ వంటి సంస్థలు కేసులు కూడా వేశాయి. ఆ తరువాత వార్నర్ మ్యూజిక్ తన వివాదాన్ని సెటిల్ చేసుకుంది. అనంతరం, సునోతో జట్టుకూడా కట్టింది. మిగితా రెండు సంస్థల వివాదాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. అయితే, భవిష్యత్తులో మ్యూజిక్ రంగం కచ్చితంగా ఏఐని రెండు చేతులా ఆహ్వానిస్తుందని షుల్మన్ విశ్వాసం వ్యక్తం చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

ఓపెన్ ఏఐ‌లో సమాచార దుర్వినియోగం.. ముగ్గురిపై వేటు

కొత్త మొబైల్ రీచార్జ్ రూల్స్.. మీకు ఈ విషయాలు తెలుసా..

Updated Date - Oct 02 , 2026 | 09:26 AM