కొత్త మొబైల్ రీచార్జ్ రూల్స్.. మీకు ఈ విషయాలు తెలుసా..
ABN , Publish Date - Sep 28 , 2026 | 01:11 PM
మొబైల్ రీచార్జ్ భారంగా మారుతున్న నేటి కాలంలో టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వినియోగదారులకు ఊరటనిచ్చే కొత్త మొబైల్ రీచార్జ్ రూల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులోని ముఖ్యాంశాలు ఏంటంటే..
ఇంటర్నెట్ డెస్క్: మొబైల్ రీచార్జ్ భారంగా మారుతున్న నేటి కాలంలో టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వినియోగదారులకు ఊరటనిచ్చే కొత్త మొబైల్ రీచార్జ్ రూల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై టెలికం సంస్థలు తమ ప్రీపెయిడ్ యూజర్లకు వాయిస్ , ఎస్ఎమ్ఎస్ ప్లాన్స్‌ను కూడా విడిగా అందించాల్సి ఉంటుంది. గతంలో వలె డేటాతో పాటు వచ్చే బండిల్డ్ ప్లాన్స్‌ను మాత్రమే అందించడానికి వీలులేదు. అల్పాదాయ వర్గాల అవసరాలు, ఇంట్లోని వైఫైని వాడే వృద్ధులు వంటివారి ప్రయోజనాలకు అనుగుణంగా ట్రాయ్ కొత్త నిబందనలను ప్రవేశపెట్టింది.
ట్రాయ్ నిబంధనల ప్రకారం, రిలయన్స్ జియో, వొడాఫోన్, భారతీ ఎయిర్‌టెల్ సంస్థలు ప్రస్తుతం అందిస్తున్న బండిల్డ్స్ ప్లాన్స్‌కు అనుబంధంగా అదే కేటగిరీలో వాయిస్, ఎస్ఎమ్ఎస్ ఓన్లీ ప్లాన్స్‌ను అంతకంటే తక్కువ ధరకు అందించాల్సి ఉంటుంది. ఒకసారి రీచార్జ్ చేసుకున్నాక మరుసటి నెలలో అదే రోజు రీచార్జ్ చేసుకునేలా వాలిడిటీ ఉండాలి. అంటే వ్యాలిడిటీని క్యాలెండర్ నెలకు మార్చారు. గతంలో 28 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్స్ ఉండేవి. దీంతో, యూజర్లు ఏడాదిలో పన్నెండు నెలలకు గాను 13 సార్లు రీచార్జ్ చేసుకోవాల్సి వచ్చేది. తాజాగా వ్యాలిడిటీని క్యాలెండర్ నెలకు పొడిగించడంతో ఏటా ఒక రీచార్జ్ భారం తగ్గుతుంది.
యూజర్లకు ప్రయోజనాలు
మొబైల్ డేటా అవసరం లేని వారికి ఈ మార్పులు చాలా ప్రయోజనాలు కలిగిస్తాయని పరిశీలకులు చెబుతున్నారు. ఇలాంటి వారు ఇకపై కేవలం వాయిస్, ఎస్ఎమ్ఎస్‌కు మాత్రమే చార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. అవసరమునుకుంటేనే డేటాతో కూడిన ప్లాన్స్‌ను ఎంచుకోవచ్చు. లేేదా ప్రత్యేకంగా డేటా రీచార్జ్ ప్యాక్స్‌ను ఎంచుకోవచ్చుర. రీచార్జ్ వ్యాలిడిటీ క్యాలెండర్ నెలకు పెంచడంతో ఖర్చులపై కూడా ఓ కన్నేసి ఉంచే అవకాశం యూజర్లకు ఉంటుంది.
ఈ వార్తలనూ చదవండి:
ట్రంప్‌తో ఆంత్రోపిక్ సీఈఓ భేటీ.. ఏఐ సేఫ్టీపై చర్చ
పాన్ కార్డులో పేరు తప్పు పడిందా..? మొబైల్‌లోనే మార్చుకోండిలా..