పాన్ కార్డులో పేరు తప్పు పడిందా..? మొబైల్‌లోనే మార్చుకోండిలా..
ABN , Publish Date - Sep 27 , 2026 | 07:45 PM
పాన్ కార్డులో ఉన్న తప్పులను సరిదిద్దడానికి ఆన్‌లైన్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం ఇక లేదు. ఇంట్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: ఈరోజుల్లో పాన్ కార్డు తప్పనిసరి. బ్యాంక్ ఖాత తెరవాలన్న, ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలన్న ఇది ఉండి తీరాల్సిందే! అయితే ఈ పాన్ కార్డులో వినియోగదారుడి వివరాలు తప్పుగా ఉంటే పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ తప్పులను సరిదిద్దుకోవడానికి ఇదివరకు ఆన్‌లైన్ సెంటర్లకు ప్రజలు క్యూ కట్టేవారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. అధికార పోర్టల్ ఎన్ఎస్‌డీఎల్ ద్వారా ఇంట్లోనే సులువుగా తప్పులను సరిదిద్దుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియను సులభంగా ఎలా పూర్తి చేయాలో తెలుసుకుందాం రండి!
మొదటి దశ
పాన్ కార్డులో తప్పులను సరిదిద్దడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. లింక్ కోసం ఇక్కడ నొక్కండి.
అక్కడ ‘న్యూ అప్లికేషన్’పై క్లిక్ చేయండి. అందులో ‘చేంజెస్ ఆర్ కరెక్షన్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాన్ డేటా’ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
ఆ తరువాత మీ కేటగిరీ, పేరు, పుట్టిన తేదీ, మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ తదితర వివరాలు నమోదు చేయండి.
ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఒక టోకెన్ నంబర్ వస్తుంది. దాన్ని భద్రంగా దాచుకోవాలి.
రెండో దశ
ఈ దశలో అవసరమైన పత్రాల ధృవీకరణ ప్రక్రియ ఉంటుంది.
ఈ-కేవైసీ ఆప్షన్ ఎంచుకుంటే ఆధార్ డేటా ఆధారంగా పేరు తక్షణమే మారిపోతుంది. ఇలా పేరులో తప్పులుంటే మార్చుకోవచ్చు.
ఒకవేళ పుట్టిన తేదీని మార్చాలనుకుంటే 10వ తరగతి మార్క్‌షీట్, పాస్‌పోర్ట్ లేదా బర్త్ సర్టిఫికేట్ లాంటివి అందులో అప్‌లోడ్ చేయాలి.
ఫోటో, సంతకాలను ఎలా అప్‌లోడ్ చేయాలి?
పాన్ కార్డులో ఫోటో, సంతకాలను మార్చుకోవాలనుకుంటే.. అందుకు ఆన్‌లైన్ అప్‌లోడ్ ఆప్షన్ ఎంచుకోవాలి.
దీనికోసం పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సంతకం ఉన్న డిజిటల్ ఫైల్‌ను సిద్ధంగా ఉంచాలి.
ఈ ఫైల్ పరిమాణం 300 కేబీని మించకూడదు.
ఇవీ చదవండి
ఫోన్ స్టోరేజీ నిండిపోయిందా? ఈ 5 చిట్కాలతో బోలెడంత స్పేస్ పొందండిలా..
తప్పుడు నంబర్‌కు యూపీఐ చేశారా? డబ్బులు తిరిగి పొందాలంటే ఇలా చేయండి