Share News

సీఎం చంద్రబాబు విజయవాడ, నెల్లూరు పర్యటన షెడ్యూల్ ఖరారు.. పూర్తి వివరాలివే..

ABN , Publish Date - Sep 27 , 2026 | 07:21 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 29వ తేదీన ఎన్టీఆర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు.

సీఎం చంద్రబాబు విజయవాడ, నెల్లూరు పర్యటన షెడ్యూల్ ఖరారు.. పూర్తి వివరాలివే..
AP CM Chandrababu Naidu

అమరావతి, సెప్టెంబర్ 27 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఈ నెల 29వ తేదీన ఎన్టీఆర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 29వ తేదీన ఉదయం 10:20 గంటలకు విజయవాడ స్వరాజ్ మైదాన్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో జరిగే 'మిషన్ కర్మయోగి' ప్రాంతీయ వర్క్‌షాప్‌కు హాజరవుతారు.


29వ తేదీన మధ్యాహ్నం 1:15 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో నెల్లూరు జిల్లాకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2:15 గంటలకు వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2:35 గంటలకు కాకోల్లువారిపల్లిలో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును పరిశీలిస్తారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో కలిసి 'శ్రమదానం' కార్యక్రమానికి హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3:05 నుంచి సాయంత్రం 5:20 వరకు రామాపురంలో జరిగే ప్రధాన కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5:30 గంటలకు రామాపురం నుంచి హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణమై.. 6:30 గంటలకు ఉండవల్లి నివాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకోనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అదానీ గ్రూప్ ఎనర్జీ మానిటరింగ్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి లోకేశ్

స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యం: మంత్రి పార్థసారథి

కర్నూలు ఎయిర్‌పోర్టు వేదికగా ఏవియేషన్ శిక్షణ: మంత్రి జనార్దన్ రెడ్డి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 27 , 2026 | 07:31 PM